[spt-posts-ticker]

కరోనాపై భయాందోళనలు వద్దు

మహబూబాబాద్‌: కరోనా వైరస్‌ నివారణకు కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో నేటి వరకు కరోనా వైరస్‌ ఛాయలు లేవని.. దీనిపై భయాందోళన చెందవద్దని కలెక్టర్‌ కోరారు. ప్రజలు కూడా వ్యక్తిగత, పరిసరాల శుభ్రత పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. జిల్లా కేంద్రంలో తహసీల్దార్‌ రంజిత్‌కుమార్‌ ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగుల బృందం ఆదివారం సినిమా థియేటర్లను ఈ నెల 21 వరకు మూసి వేయించారు. జనసమ్మర్థం కలిగి ఉండే రైల్వేస్టేషన్లు, బస్టాండ్స్‌, ఇతర రద్దీ ప్రాంతాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో డిస్‌ఇన్సెక్షన్‌ శానిటీజరు స్ప్రే చేయించారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *