[spt-posts-ticker]

కరోనా అనుమానంతో ఆసుపత్రికి వ్యక్తి అవగాహన కల్పించి పంపించిన వైద్యాధికారి

మంచిర్యాల : కరోనా..భయంతో ఈనెల 13న సింగపూర్‌ నుంచి తిరిగివచ్చిన ఓ వ్యక్తి ఆదివారం జిల్లా ఆసుపత్రికి వచ్చారు. జిల్లాకు కేటాయించిన కరోనా నోడల్‌ అధికారి డా. బాలాజీ బాధితుడితో మాట్లాడారు. పూర్తి వివరాలు సేకరించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. స్వదేశానికి వచ్చి మూడు రోజులే కావడం, కరోనాకు సంబంధించిన ఎటువంటి లక్షణాలు అతనిలో లేకపోవడంతో ముందస్తు జాగ్రత్తలు తెలియజేసి పంపించారు. కొన్ని రోజులపాటు ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదని వివరించారు. పూర్తి వివరాలు సేకరించడంతో పాటు దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి ఇలా ఏ సమస్య వచ్చినా వెంటనే తమకు సమాచారం అందించాలని సూచించారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *