[spt-posts-ticker]

కరోనా ఎఫెక్ట్: గూగుల్, ట్విటర్ కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనావైరస్ అంతకంతకూ విస్తరిస్తున్న కారణంగా ప్రచంచ వ్యాప్తంగా టెక్ కంపెనీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఏటా నిర్వహించే ప్రాముఖ్యమైన ఈవెంట్లను రద్దు చేసుకోగా.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి.  తమ ఉద్యోగులు ఇళ్ల వద్ద నుంచే పనిచేయాలంటూ గూగుల్, ట్విటర్ సహా పలు టెక్ సంస్థలు ప్రకటించాయి. ముందస్తు జాగ్రత్తలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించాయి. రాయిటర్స్ కథనం ప్రకారం.. డబ్లిన్‌లోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న 8 వేల మంది ఉద్యోగులను ఇంటివద్ద నుంచే పనిచేయాలంటూ గూగుల్ ఆదేశించింది. ఇక్కడ పనిచేస్తున్న ఓ ఉద్యోగికి ఫ్లూ లక్షణాలు కనిపించడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఇక మరో టెక్ దిగ్గజం ట్విటర్ కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులందరూ ఇంటివద్ద నుంచే పనిచేయాలంటూ ఆదేశించింది. ప్రత్యేకించి ఆసియాలోని పలు ప్రాంతాల్లో పనిచేస్తున్న తమ ఉద్యోగులు తప్పని సరిగా ఇంటివద్ద నుంచే పనిచేయాలంటూ కంపెనీ స్పష్టం చేసింది. కాగా క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజి కంపెనీ కాయిన్‌బేస్ సైతం ఇదే తరహా జాగ్రత్తలు తీసుకుంది. ఇంటి వద్ద నుంచి పనిచేయడం సంపూర్ణ పరిష్కారం కాకపోయినప్పటికీ… ఇన్‌ఫెక్షన్స్‌ను అరికట్టేందుకు ఇది కొంతమేర సాయపడుతుందని కాయిన్‌బేస్ సీఈవో బ్రియాన్ ఆర్మ్‌స్ట్రాంగ్  ట్విటర్లో పేర్కొన్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *