[spt-posts-ticker]

కరోనా కట్టడిలో ప్రభుత్వ చర్యలు భేష్‌: గవర్నర్‌

హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి) :‘కరోనాను అరికట్టేందుకు ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ (వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, మీడియా, మున్సిపాలిటీ, శానిటరీ సిబ్బంది) అహర్నిశలు కష్టపడుతున్నారు.. ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు.. వారికి బాసటగా నిలుద్దాం…కలిసి వైరస్‌ను తరమికొడుదాం’….అంటూ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పిలుపునిచ్చారు.  ఇటీవల నిమ్స్‌  కార్డియాలజీ, ఇతర విభాగాల వైద్యులు, సిబ్బంది కరోనా వైరస్‌ బారినపడ్డారు. ఈ నేపథ్యంలో వారికి ధైర్యం చెప్పేందుకు దవాఖానకు వచ్చినట్లు గవర్నర్‌ తెలిపారు. తొలుత ఆమె మిలీనియం బ్లాకులో చికిత్స పొందుతున్న వైద్యులు, సిబ్బందిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని డైరెక్టర్‌ డాక్టర్‌ కె. మనోహర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గవర్నర్‌ మీడియాతో మాట్లాడుతూ ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ దేశాన్ని, రాష్ర్టాన్ని రక్షించేందుకు 24/7 పోరాడుతున్నారని, నిస్వార్థంగా కరోనా బాధితులకు సేవలందించే క్రమంలో వారూ వైరస్‌ బారిన పడుతున్నారని, వారిలో మానసిక ైస్థెర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయన్నారు.  జీవితం ఎంతో ముఖ్యమైందని, ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రావద్దని, దయ చేసి మాస్కులు ధరించాలని చేతులు జోడించి అభ్యర్థించారు. కరోనా కట్టడిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న మీడియాను ప్రశంసించారు. యువ జర్నలిస్టు మరణం తనను కలిచి వేసిందన్నారు. మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నిమ్మ సత్యనారాయణ, అసిస్టెంట్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ లక్ష్మీభాస్కర్‌, డిప్యూటీ రెసిడెంట్‌ కృష్ణారెడ్డి,  రెసిడెంట్‌ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *