హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి): కరోనాను కట్టడి చేయడంలో సీఎం కేసీఆర్ రియల్ హీరో అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కొనియాడారు. ప్రజల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి దూరదృష్టితో ఆలోచిస్తున్నారని అన్నారు. ఆర్థికంగా నష్టం జరుగుతున్నప్పటికీ ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ను పొడిగించారని గుర్తు చేశారు. నిరుపేదలు, వలస కూలీలు ఆకలితో అలమటించకూడదని యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగిస్తున్నారని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో గుత్తా సుఖేందర్రెడ్డి ప్రశంసించారు.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]