కరోనా గురించి ఆందోళన వద్దంటున్నారు హార్వర్డ్ యూనివర్సిటీ నిపుణులు. వైరస్ కన్నా ఆందోళనే ప్రమాదకరమని వారు అంటున్నారు. ఆందోళన తగ్గించుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చంటున్నారు. అందుకోసం ధ్యానం చేయాలని సూచిస్తున్నారు. అమెరికాలో ఇప్పటివరకు 3,777 మందికి కరోనా వైరస్ సోకింది. వీరిలో 69 మంది చనిపోయారు. మరణాల సంఖ్య చాలా తక్కువగానే ఉన్నా ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
సమస్య ఉత్పన్నమైన తర్వాత బాధపడేకంటే ముందుగానే కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హార్వర్డ్ యూనివర్సిటీ నిపుణులు ప్రకటించారు. యూనివర్సిటీ ప్రచురించిన ఆరోగ్య మార్గదర్శ నివేదికలో ఈ విషయాన్ని పొందుపరిచారు. ఒంటరి భావన.. ఆందోళన.. ఒత్తిడి.. ఏదో జరగబోతుంది అనే కంగారు వంటి వాటిని ధ్యానం చక్కబెడుతుందని చెప్పారు. ధ్యానంతో పాటు యోగా కూడా చేయాలని వారు సూచిస్తున్నారు.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]