ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి లండన్‌కు చెందిన క్వీన్ మేరీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కొత్త విషయాన్ని చెప్పుకొచ్చారు. కరోనా ఇప్పటికిప్పుడు వచ్చి పోయే ఉపద్రవం కాదని, సీజనల్ ఇన్ఫెక్షన్ అని శాస్త్రవేత్తలు తేల్చారు. ప్రతీ సంవత్సరం వచ్చే సీజనల్ వ్యాధుల వంటిదేనని, ఇది పూర్తిగా అంతమయ్యేది కాదని.. ప్రతీ సంవత్సరం సీజన్లో వైరస్ వ్యాప్తి చెందే అవకాశముందని లండన్ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. సహజంగా సీజన్లో వచ్చే జలుబు, దగ్గు వంటివి కరోనా వంటి వైరస్‌ను వ్యాప్తి చెందేందుకు దోహదపడతాయని చెప్పారు. జలుబు, చెస్ట్ ఇన్ఫెక్షన్, ఫ్లూ లానే కరోనా కూడా శాశ్వత వైరస్ అని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. గత 50 ఏళ్లుగా మనందరికీ తెలిసిన వైరస్ వంటిదే కరోనా కూడా అని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]