[spt-posts-ticker]

కరోనా టీకా వేయించుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు

 కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176  9848025451)

– టీకా వల్ల ఎలాంటి అపాయం లేదన్న మంత్రి

వరంగల్ అర్బన్,(ఆరోగ్యజ్యోతి):  టీకా తీసుకోవడం వల్ల ఎలాంటి అపాయం లేదని సాధారణ ప్రజలకు భరోసా కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖల‌ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా వ‌రంగ‌ల్‌లోని ఎంజిఎం దవాఖానలో కొవిషీల్డ్‌ టీకా తొలి డోసు వేయించుకున్నారు. అలాగే తమ సతీమణి ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావు, వారి కుటుంబ సభ్యులు టీకాలు వేయించుకున్నారు. అలాగే మేయర్ గుండా ప్రకాష్ రావు కూడా టీకా తీసుకున్నారు.అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మేయర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లలితాదేవి, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ నాగార్జున రెడ్డి తదితరులతో టికా కార్యక్రమంలో ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి  మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా రెండో దశ వ్యాప్తి పెద్దగా లేదని చెప్పారు. ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. మొద‌టి క‌రోనా వైర‌స్ నే ఎదుర్కొన్న మ‌న‌కు రెండో వైర‌స్ పెద్ద‌గా లెక్క కాద‌న్నారు. అయిన‌ప్ప‌టికీ, ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, సామాజిక భౌతిక‌ దూరం పాటిస్తూ, మాస్కులు ధ‌రించాల‌న్నారు. కొద్దిపాటి జాగ్ర‌త్త‌లు పాటిస్తూ నిత్య జీవ‌న వ్య‌వ‌హారాలు చూసుకోవాల‌ని సూచించారు. ఈ సందర్భంగా కరోనాపై జరుగుతున్న పోరులో శాస్త్రవేత్తలు, డాక్టర్లు, న‌ర్సులు, ఇత‌ర మెడిక‌ల్, పారా మెడిక‌ల్ సిబ్బంది ఫ్రంట్ వారియ‌ర్లు చేస్తున్న కృషిని మంత్రి కొనియాడారు.60 ఏండ్లు పైబడిన వారితోపాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు టీకా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కరోనా వ్యాక్సిన్‌పై అపోహలు వద్దని సూచించారు. అర్హులైన వారంతా టీకా కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడుత కొవిడ్ వ్యాక్సినేషన్‌ ప్రారంభమయ్యింద‌ని, ఇందులో భాగంగా 60 ఏండ్లు పైబడిన వారితోపాటు 45-59 ఇండ్లల్లో ఉండి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు టీకాలు వేయనున్నారని మంత్రి చెప్పారు. రెండు కేటగిరీల్లో 50 లక్షల మంది ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారని అయన తెలిపినారు. ఈ కార్యక్రమంలో ఎం జి ఎం, ఆర్ ఎం వో లు డాక్టర్ హరీష్ రాజ్,  డాక్టర్  సాంబరాజు ,డాక్టర్ అరవింద్ ,జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *