[spt-posts-ticker]

కరోనా నియంత్రణలో రాబోయే మూడు నెలలు అత్యంత కీలకం

వరంగల్ (ఆరోగ్యజ్యోతి) : గత 8 నెలలుగా కరోనా నివారణకు అహర్నిశలు పోరాటం చేస్తున్నామని దాని ఫలితంగా రాష్ట్రం కరోనా నియంత్రణ లో ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ జి శ్రీనివాస రావు అన్నారు.మంగళ వారం ప్రవేటు హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో డైరెక్టర్మాట్లాడుతూ  రాబోయే మూడు నెల లైనా నవంబర్ డిసెంబర్   జనవరి నెలల్లో covid 19   వ్యాప్తి చెందకుండా అత్యంత జాగ్రత్తగా ప్రజలు ఉండవలసిన అవసరం ఉందన్నారు. పండుగలు  ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయన కోరారు . వ్యాక్సిన్ కోసం ఎదురు చూడకుండా  4 ముఖ్యమైన జాగ్రత్తలు తప్పని సారిగా  పాటించాలని అన్నారు. ముఖ్యంగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, గుంపులు దూరంగా ఉండడం,  చేతుల శుభ్రత  తప్పని సరిగా పాటించాలన్నారు.చలి కాలం లోవైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున దీర్ఘ కాలిక వ్యాధి తో భాధ పడేవారు వృద్దులు చిన్న పిల్లల పై మరింత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇతర దేశాల్లో  kovid 19 కేసులు ఎక్కువ సంఖ్య లో పెరుగుతున్న దృష్ట్యా  మనకు అలాంటి పరిస్థితుల  రాకుండా ముందు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.ప్రజలు  స్వంత వైద్యం జోలికి పోకుండా చలి కాలం లో వచ్చే  జ్వరం దగ్గు జలుబు ఉన్నప్పుడు నిర్లక్షం వహించకుం డ  డాక్టర్ ను సంప్రదించి kovid నిర్ధారణ పరీక్షలు చేపించు కో వలన్నారు .ప్రస్తుతం రాష్టంలో  44 లక్షలు పైగా కరోనా పరీక్షలు చేసినట్లు  అందులో 2లక్షల 46 వేల 504  పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో 1600 మరణాలు సంభవించాయి 0.5  మరణాల శాతం మాత్రమే నమోదు అయినట్లు వెల్లడించారు.ప్రస్తుతం17 వేల 740  అక్టివ్ కేసులు ఉండగా కేవలం 2 వేల 800 మంది మాత్రమే వివిధ ఆసుపత్రుల్లో చికిత్స చేయించు కుంటున్నట్లుపేర్కొన్నారు .కరోనా నివారణ కోసం ప్రజలు తీసుకున్న జాగ్రత్తల తో పాటుగా పరిసరాల పరిశుభ్ర మూలంగా సీజనల్ వ్యాధులు 50 శాతం మేర తగ్గినట్లు  చెప్పారు.రోనా వైరస్ నియంత్రణ లో మీడియా ముఖ్య పాత్ర  వహించింది ఇదే సహకారం మున్ముందు అందించాలని  ప్రతి ఒక్కరినీ కోరారు.ఈ సమావేశం లో   జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డాక్టర్ కే లలిత దేవి ,డా .మధుసూధన్, డా. మహేందర్  డా డి .శ్రీరామ్, డా A అప్పయ్య, డా సుదర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *