[spt-posts-ticker]

కరోనా నివారణకు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా హీరోల సందేశం వీడియో

హైదరాబాద్‌: కరోనావైరస్‌ నివారణకు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా హీరోలు జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కొనిదెల సందేశాన్ని ఇచ్చారు. డబ్ల్యూహెచ్‌వో సూచించిన ఈ ఆరు సూత్రాలు పాటిస్తే కరోనావైరస్‌ బారిన పడకుండా కాపాడుకోవచ్చని తెలిపారు.

  • చేతులను సబ్సుతో మోచేతుల వరకు కడుక్కోండి, గోళ్ల సందుల్లో కూడామురికి లేకుండా శుభ్రం చేసుకోండి, బయటకు వెళ్లచ్చినప్పుడు తప్పకుండా చేతులు శుభ్రంచేసుకోవాలి. రోజుకు ఏడు నుంచి ఎనిమిది సార్లు చేతులను కడుక్కోవాలి.
  • కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గే వరకు తెలిసివాళ్లు ఎదుటపడితే కౌగిలించుకోవడం, షేక్‌హ్యాండ్స్‌ ఇవ్వడం, మానేయండి. అనవసరంగా కళ్లు రుద్దుకోవడం, ముక్కు తూడుచుకోవడం, నోట్లో వేళ్లుపెట్టుకోవడం మానేయాలి.
  • మీకు పొడిదగ్గు, జ్వరం, జలుబు ఉందనిపిస్తేనే మాస్కులు వేసుకోవాలి. ఏవీ లేకుండా వేసుకుంటే కోవిడ్‌ 19 మీకు అంటుకునే ప్రమాదం ఉంటుంది. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, అరచేతులను కాకుండా మోచేతులను అడ్డుపెట్టుకోవాలి.
  • జనం ఎక్కువగా ఉండే చోటికి వెళ్లకండి, మంచినీళ్లు ఎక్కువ తాగండి. నీటిని గడగడ తాగకుండా ఎక్కువసేపు స్విప్‌ చేయడం, వేడి నీళ్లయితే చాలా మంచిది.
  • వాట్సప్‌లో వచ్చే ప్రతీ వార్తను దయచేసి నమ్మేయకండి. వాటిలో నిజం ఎంతో తెలియకుండా ఫార్వర్డ్‌ చేయకండి. దీనివల్ల అనవసర భయందోళన కలుగుతుంది. ఇది వైరస్‌ కన్నా ప్రమాదకరమైనది.
  • www.who.int  వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తుంటారు. వాటిని ఫాలోకండి. కోవిడ్‌ -19 మీద ప్రభుత్వం ఇచ్చే సలహాలు, అప్‌డేట్స్‌ తప్పకుండా పాటిద్దాం. మనలను మనమే కాపాడుకుందాం. శుభ్రత పాటించండి, ఆరోగ్యంగా ఉండండని సందేశం ఇచ్చారు
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *