[spt-posts-ticker]

కరోనా బాధితుడి బర్త్‌డే పార్టీ.. అధికారుల ఉరుకులు పరుగులు

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఇప్పుడు ఢిల్లీలో కలకలం రేపుతోంది. జనం భయంభయంగా గడుపుతున్నారు. ఇటీవల ఇటలీ నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో అధికారులు కరోనా వైరస్ లక్షణాలను గుర్తించారు. దీంతో అతడు ఎవరెవరిని కలిశాడో గుర్తించేందుకు వైద్యాధికారులు పరుగులు తీస్తున్నారు. అంతేకాదు, నోయిడాలో అతడి కుమారుడు చదువుకుంటున్న స్కూల్‌తో పాటు మరో స్కూల్‌ను కూడా ముందు జాగ్రత్త చర్యగా కొన్ని రోజులపాటు మూసి వేస్తున్నట్టు ప్రకటించారు.

కరోనా బాధిత వ్యక్తి తన కుమారుడికి ఢిల్లీలోని హయత్ హోటల్‌లో ఘనంగా బర్త్ డే పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీకి నోయిడా నుంచి రెండు కుటుంబాలతోపాటు కొందరు విద్యార్థులు కూడా హాజరయ్యారు. ఆ పార్టీకి హాజరైన విద్యార్థులకు కూడా ముప్పు పొంచి ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. తమ హోటల్‌లో కరోనా బాధితుడు బర్త్ డే పార్టీ ఇచ్చిన విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే హయత్ గ్రూప్ స్పందించింది. తమ అతిథులు భయపడాల్సిందేమీ లేదని, వారి భద్రతే తమకు మొదటి ప్రాధాన్యమని స్పష్టం చేసింది. ప్రభుత్వ అధికారుల సలహాతో హోటల్‌లో కట్టుదిట్టమైన పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తున్నట్టు పేర్కొంది. హోటల్‌లోని అన్ని విభాగాల్లోనూ నివారణ చర్యలు చేపట్టినట్టు వివరించింది.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *