[spt-posts-ticker]

కరోనా భయం అవసరం లేదు: డీఎంహెచ్‌వో

ఖమ్మం:  మన జిల్లాలో కరోనా వ్యాధి ప్రబలుతుందనే భయం అవసరం లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ బి. మాలతి పేర్కొన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మన దేశంలో కేరళలో మాత్రమే మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లా కార్యాలయంలో ఒక ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డీఎస్‌వో డాక్టర్‌ కోటిరత్నం, ఎపిడిమాలజిస్ట్‌ డాక్టర్‌ మాధవరావు, హెచ్‌ఈవో సత్యనారాయణ, మైక్రోబయాలజిస్ట్‌ అశోక్‌రెడ్డి, హెచ్‌ఈ వేణుగోపాల్‌ ఈ సెల్‌లో అందుబాటులో ఉంటారన్నారు. దగ్గు, జలుబు, జ్వరం తదితర లక్షణాలు ఉన్న అనుమానిత కేసులను గుర్తిస్తే వెంటనే వీరు స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. జిల్లా ప్రజలు ఎవరూ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని తెలిపారు. అనంతరం మిషన్‌ ఇంద్రధనుష్‌ గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. 12రకాల వ్యాధులు రాకుండా పిల్లలకు వేసే ఈ టీకాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా టీకాల అధికారి డాక్టర్‌ అలివేలు తదితరులు పాల్గొన్నారు.

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *