[spt-posts-ticker]

కరోనా విశ్వరూపం

  • 149 దేశాల్లో ఉగ్రతాండవం.. లక్షన్నర కేసులు.. 5500 మృతులు

 

వాషింగ్టన్‌, మార్చి  14: కరోనా ఉగ్రతాండవం చేస్తోంది. 149 దేశాలకు విస్తరించింది. అంటే.. మూడొంతుల పైబడి ప్రపంచాన్ని కమ్మేసింది. కరోనా బారిన పడ్డవారి సంఖ్య 1,51.761కి చేరుకున్నప్పటికీ ఇందులో 73,726 మందికి నయమై డిశ్చార్జి చేశారు. మృతుల సంఖ్య 5,764కు పెరిగింది. ప్రస్తుతం ఏకాంతవాసంలో ఉన్న 75వేల మందిలో 6వేల మంది పరిస్థితి గడ్డుగా ఉంది. అమెరికాలో మృతుల సంఖ్య 50కి చేరడంతో దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోగ్య అత్యవసర పరిస్థిఽతిని విధించారు. ఎమర్జెన్సీ కింద దాదాపు 50 బిలియన్‌ డాలర్ల మేర నిధులు అందుబాటులోకి వస్తాయి. ఇక ప్రతీ రాష్ట్రంలో అత్యవసరంగా వైద్య కేంద్రాలు, ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటవుతాయి. ప్రతీ ఆస్పత్రికీ అనుబంధంగా అత్యవసర చికిత్స సౌకర్యాలు ఏర్పాటవుతాయి. స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాళ్లు, క్రీడా పోటీలు.. అన్నీ బంద్‌ అయ్యాయి. సామూహిక ప్రార్థనలు, మత సమావేశాల్ని అన్ని రాష్ట్రాలూ నిలిపేశాయి. కరోనా కిట్లు లభించకపోవడంతో ప్రైవేటు రంగ సహకారాన్ని సైతం తీసుకుంటున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. ‘‘పరిస్థితి మరింత విషమించవచ్చు. వచ్చే ఎనిమిది వారాలూ అత్యంత కీలకం’’ అని ఆయన దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో హెచ్చరించారు. అమెరికా ఇప్పటికే యూర్‌పకు విమాన సర్వీసులన్నీ నిలిపేసింది.

” alt=”” aria-hidden=”true” />

ఇపుడు బ్రిటన్‌కు కూడా ఆపేసింది. మెక్సికో, హోండూరా్‌సల సరిహద్దులు మూసేసింది. ఇక వైరస్‌ వ్యాప్తికి కేంద్రస్థానంగా మారిన ఐరోపాలో కరోనా సోకని దేశమంటూ లేదు. ఇటలీలో ప్రస్తుతం నిర్మానుష్యమైన వీధులు, కర్ఫ్యూని తలపించేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. 1,266 మంది మరణించారు. డిశ్చార్జి అయిన వారి సంఖ్య తీసేయగా.. ఇంకా 15వేల మంది ఐసోలేషన్‌లోనే ఉన్నారు. 1,328 మంది చావుబతుకులతో పోరాడుతున్నారు. కాగా, వైర్‌సనుంచి కోలుకున్న చైనా ఇటలీని ఆదుకునేందుకు రంగంలోకి దిగింది. 9 మంది నిపుణులైన వైద్య బృందాన్ని రోమ్‌కు పంపింది.

 

ఇరాన్‌: రంగంలోకి మిలటరీ

గల్ఫ్‌ దేశాల్లో వైరస్‌ బారిన పడి విలవిల్లాడుతున్న ఇరాన్‌లో ఒక్కరోజులో 100 మంది చనిపోవడంతో మృతుల సంఖ్య 614కు పెరిగింది. 12,783 మందికి ఇది సోకింది. పరిస్థితిని సైన్యం తన చేతుల్లోకి తీసుకుంది. రోడ్లపై ఎవరు సమూహాలుగా కనబడ్డా, షాపులు తెరిచినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. వైరస్‌ కేంద్ర స్థానమైన క్వోమ్‌ నగరంలో సామూహిక ఖననానికి ఏర్పాట్లు చేస్తున్న దృశ్యాలు బయటకు పొక్కాయి.

 

న్యూజిలాండ్‌ కఠిన ఆంక్షలు

విదేశాల నుంచి న్యూజిలాండ్‌కు వచ్చేవారు తప్పనిసరిగా 14రోజుల పాటు స్వీయ ఏకాంతవాసంలోకి వెళ్లాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. ఇది న్యూజిలాండ్‌వాసులకూ వర్తిస్తుంది. అన్ని సామూహిక సమావేశాలను రద్దు చేసింది. చివరకు నిరుడు క్రైస్ట్‌చర్చ్‌ ఊచకోత మృతుల సంస్మరణ కార్యక్రమం కూడా వాయిదావేసింది.

రష్యా : సరిహద్దులు మూసివేత

రష్యాలో మరణాలేవీ చోటుచేసుకోలేదు. కానీ కేసుల సంఖ్య 59కు పెరిగింది. చైనాతో  4,200 కిమీ పొడవునా ఉన్న ప్రవేశ మార్గాలను పుతిన్‌ ప్రభుత్వం బంద్‌ చేసింది. పోలెండ్‌, నార్వే సరిహద్దులనూ మూసేసింది. రష్యాలో కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. అవసరం లేకుండా ఎవరూ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లకూడదు. సమూహాలుగా తిరగరాదు. 135 మిలియన్‌ డాలర్ల ఖర్చుతో ఓ తాత్కాలిక ఆసుపత్రిని కేవలం ఇటలీ నుంచి వచ్చే పేషెంట్ల కోసమే నిర్మిస్తున్నారు. రష్యాతో పాటు పోలెండ్‌, ఉక్రెయిన్‌, స్విట్జర్లాండ్‌, వెనెజులా, కొలంబియా… ఇలా ప్రతీ దేశమూ సరిహద్దుల్ని మూసేసింది.

 

ఫిలిప్పీన్స్‌లో కర్ఫ్యూ

మనిలాలో వైరస్‌ వ్యాప్తి ప్రబలంగా ఉండడంతో ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం అక్కడ పూర్తి కర్ఫ్యూ విధించింది. కొన్ని నియంత్రణలు విధించి వాటిని పాటిస్తూ అత్యవసరాల కోసం మాత్రమే ప్రజలను అనుమతిస్తామని, పగటిపూట ఆఫీసులు వెళ్లడానికి పరిమితంగా పర్మిషన్లు ఇస్తామని, రాత్రిళ్లు అంటే సాయంత్రం 7 గంటల నుంచే కర్ఫ్యూ అమలు చేస్తామని అధ్యక్షుడు రోడ్రిగో డుటార్టె చెప్పారు.

 

పాక్‌లో స్కూళ్ల మూసివేత

పాకిస్థాన్‌లో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 33కు పెరిగింది. దేశమంతా స్కూళ్లు, ఫంక్షన్‌ హాళ్లు, ప్రార్థనా స్థలాలను తాత్కాలికంగా మూసేస్తున్నట్లు ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రకటించారు. విదేశీయానాలపై ఆంక్షలు విధించారు. పాక్‌కు వచ్చే విదేశీయులందరినీ క్వారంటైన్‌ చేస్తున్నారు.

స్పెయిన్‌ నుంచి గాల్లోనే విమానాలు వెనక్కి!

ఇటలీ తరువాత వైరస్‌ తీవ్రంగా ఉన్న స్పెయిన్‌లో ఒక్క రోజులోనే కేసుల సంఖ్య 1500కు పైగా పెరిగి.. ఆరువేలు దాటాయి. మృతుల సంఖ్యను కొన్ని వెబ్‌సైట్లు 136 మాత్రమే అని పేర్కొనగా.. మరికొన్ని 191కు పెరిగాయని వెల్లడించాయి. కాగా, లండన్‌ నుంచి స్పెయిన్‌కు బయల్దేరిన నాలుగు జెట్‌2 విమానాలు బార్సిలోనాలో దిగకుండానే వెనుదిరిగాయి. స్పెయిన్‌లో 15రోజుల ఎమర్జెన్సీ అమల్లో ఉంది. ప్రయాణికులందరి భద్రత దృష్ట్యా ఆఖరి నిమిషంలో ల్యాండ్‌ అవకుండా వెనక్కి వచ్చేయాలని సంకేతాలు పంపినట్లు జెట్‌2 సంస్థ తెలిపింది.

కెనడా పార్లమెంట్‌ మూసివేత

కెనడాలో పార్లమెంట్‌ను కూడా నిరవధికంగా మూసేశారు. ప్రఽస్తుతం ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఏకాంతవాసంతో ఇంట్లోనే ఉంటున్నారు. కారణం.. ఆయన భార్య సోఫీకి వైరస్‌ సోకడం! పార్లమెంట్‌ మూసివేతతో కేంద్ర బడ్జెట్‌ సమర్పణ నిలిచిపోయింది. దేశంలో అనేక ఆంక్షలు విధించారు. ఇందులో వ్యక్తుల మధ్య దూరం పాటించాలన్నది ప్రధానమైనది.

 

లండన్‌లో నవజాత శిశువుకు కరోనా

బ్రిటన్‌లో అప్పుడే పుట్టిన ఓ ఆడ శిశువుకు కరోనా వైరస్‌ ఉన్నట్లు డాక్టర్లు తేల్చారు. మిడిల్‌సెక్స్‌లోని ఎడ్మాంటన్‌ ఆస్పత్రిలో ఈ శిశువు జన్మించింది. ప్రపంచంలో ఈ వైరస్‌ వచ్చిన అతి పిన్న వయస్కురాలు ఆ శిశువే. ప్రసవానికి ముందు నుంచి ఆ శిశువు తల్లి న్యుమోనియాతో బాధపడుతోంది. అయితే కరోనా సంబంధ పరీక్షలు ఆమెకు చేయలేదు. శిశువు పుట్టాక తల్లి శాంపిల్స్‌ కూడా పరీక్షకు పంపారు. తల్లీ బిడ్డలను వేరుచేసి తల్లిని ప్రత్యేక ఏకాంతవాస వార్డుకు తరలించారు.  బ్రిటన్‌లో ఒక్కరోజే పదిమంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 21కు పెరిగింది.

ట్రంప్‌కూ టెస్టులు

ట్రంప్‌ కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ‘‘వైట్‌హౌ్‌సలోనే శుక్రవారం రాత్రి అవసరమైన పరీక్షలు చేయించుకున్నాను’’ అని ఆయన శనివారం మీడియాకు చెప్పారు. గతవారం బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సెనారోతో ఆయన వైట్‌హౌ్‌సలో సమావేశమయ్యారు. వైరస్‌ సోకిన బ్రెజిల్‌ అధ్యక్షుడి భద్రతా అధికారి కూడా శ్వేతసౌధంలో ట్రంప్‌కు సమీపంలోనే ఉన్నట్లు తరువాత వార్తలొచ్చాయి.  దీన్ని దృష్టిలో ఉంచుకుని ట్రంప్‌ ప్రత్యేక పరీక్షలు చేయించుకున్నారు.

అమెరికాలో తానా హెల్ప్‌లైన్‌ 1855..

కరోనా వైరస్‌ కారణంగా అమెరికాలో ఇబ్బందులు పడుతున్న భారత విద్యార్థులను ఆదుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసింది. కరోనా నియంత్రణలో భాగంగా మూతపడిన కాలేజీలు, యూనివర్సిటీల విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పిస్తామని తెలిపింది. ఇందుకోసం హెల్ప్‌లైన్‌ నంబరు 1855ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈఫిల్ టవర్ మూసివేత

కరోనా వైరస్‌ వేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో పారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ను శుక్రవారం నుంచి మూసేశారు. పరిస్థితులు చక్కబడిన అనంతరం తిరిగి సందర్శకులను అనుమతిస్తారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *