[spt-posts-ticker]

కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు చైనా ఆమోదం

బీజింగ్ (చైనా): ప్రపంచవ్యాప్తంగా లక్షమందిని బలిగొన్న కరోనా వైరస్ నిరోధానికి వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు చైనా ప్రభుత్వం తాజాగా ఆమోదించింది. కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను ప్రారంభ దశ మానవ పరీక్షలు జరిపేందుకు చైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కరోనా టీకాలను బీజింగ్ ఆధారిత నాస్డాక్-లిస్టెడ్ సినోవాక్ బయోటెక్ యూనిట్, ప్రభుత్వ యాజమాన్యంలోని చైనా నేషనల్ ఫార్మాస్యూటికల్ గ్రూప్ అనుబంధ సంస్థ వుహాన్ ఇన్‌స్టి‌ట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ అభివృద్ధి చేస్తున్నాయి.మరోవైపు చైనా అకాడమీ ఆఫ్ మిలటరీ మెడికల్ సైన్సెస్, హెచ్ కె లిస్టెడ్ బయోటెక్ సంస్థ కాన్సినో బయో అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం కూడా చైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ టీకాల ప్రయోగాత్మక పరీక్షలు విజయవంతం అయితే త్వరలో కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వస్తోందని శాస్త్రవేత్తలంటున్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *