శివమొగ్గా (కర్ణాటక): కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్థుత తరుణంలో కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గా జిల్లాలో మంకీ జ్వరాలు విజృంభిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. శివమొగ్గా జిల్లాలో 139 మందికి మంకీ జ్వరాలు రాగా, వీరిలో ముగ్గురు మరణించారని ఆ జిల్లా డిప్యూటీ కమిషనర్ కేబీ శివకుమార్ చెప్పారు. మంకీ జ్వరాలు వచ్చిన వారిలో 130 మందికి చికిత్స చేయడంతో వారు కోలుకున్నారని శివకుమార్ పేర్కొన్నారు. మంకీ జ్వరం వల్ల ఒక రోగి మరణించాడని తేలిందని, మరో ఇద్దరు రోగులు కూడా మరణించారని, వారి పరీక్షల నివేదికలు రావాల్సి ఉందని కమిషనర్ చెప్పారు. గత ఏడాది శివమొగ్గా జిల్లాలో ప్రబలిన మంకీ జ్వరాలు 400 మందికి రాగా, ఇందులో 23 మంది మరణించారు. శివమొగ్గా అడవుల్లోని కోతుల ద్వార వస్తున్న ఈ మంకీ జ్వరాలు ఈ ఏడాది కూడా ప్రబలడంతో ప్రజలు కలవరపడుతున్నారు.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]