అమ్మ కావడం గొప్ప అనుభూతి. గర్భం దాల్చిన మొదటి నెల నుంచి ప్రసవమయ్యే వరకు… కాబోయే అమ్మకు ప్రతి క్షణం అపురూపమే. అలాంటి అపురూప క్షణాలని ఆస్వాదించేందుకు ఉద్యోగ జీవితం అడ్డురాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి… ●
విధుల్లో భాగంగా ఇతర ప్రాంతాలకు వెళుతుండటం సహజం. అయితే ఇలాంటి సమయంలో దూర ప్రయాణాలకు దూరంగా ఉంటేనే మంచిది.ఆఫీసు పనుల్లో క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ గర్భం దాల్చినప్పటి నుంచి తరచూ చెకప్‌కు వెళ్లడం మరిచిపోవద్దు.ఈ సమయంలో ఒత్తిడికి దూరంగా ఉండేందుకు.. తేలికపాటి వ్యాయామాలు చేయడం, జోక్స్ చదవడం, చక్కటి సంగీతం వినడం లాంటి పనులు చేయాలి. ●ఎక్కువ సేపు నిలబడటం లేదా కూర్చోవడం చేయొద్ధు దేనికైనా సరే… మధ్యమధ్యలో స్వల్ప విరామాలు తప్పనిసరిగా తీసుకోవాలి.వర్కింగ్ టేబుల్ కింద ఎల్లప్పుడూ పాదాలు పెట్టుకోవడానికి ఫుట్‌రెస్ట్ ఉండేలా జాగ్రత్త పడాలి. ●ఆఫీసు పనులు సమయానికి అవ్వకపోవడం అనేది సహజమే అయినా.. ఇలా తరచూ జరగకుండా చూసుకోవాలి. ముఖ్యంగా సమయానికి పనులు పూర్తిచేసి ఇంటికి వెళ్లడంపై దృష్టి పెట్టాలి.కొన్ని కార్యాలయాల్లో డ్రెస్‌కోడ్ ఉంటుంది. ఇందులో భాగంగా ఎత్తు మడమలూ ధరించాల్సి రావొచ్ఛు ఇలాంటప్పుడు మాత్రం అవి అస్సలొద్ధు●మీరు పరీక్షలు చేయించుకుంటున్న ఆసుపత్రి గురించిన సమాచారాన్ని సమీక్షించండి.మీ సంస్థ ఇస్తున్న ప్రసూతి సెలవులు, దానికి సంబంధించిన నియమ, నిబంధనలను జాగ్రత్తగా గమనించండి.ఈ సమయంలో మీకు సౌకర్యవంతంగా ఉండే దుస్తులను మాత్రమే ధరించండి. అప్పుడే మీకు హాయిగా ఉంటుంది.