[spt-posts-ticker]

కిడ్నీ బాధితుడికి విద్యార్థుల సాయం

చికిత్స కోసం రూ.1.96 లక్షల విరాళంతో ఉదారత

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న బాలుడు, తల్లిదండ్రులకు నగదు

 

ఆదిలాబాద్‌ : కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న బాలుడికి కాన్వెంట్‌ విద్యార్థులు చికిత్స కోసం సాయం అందించి ఉదారత చాటుకున్నారు. తాంసి మండల కేంద్రానికి చెందిన ఎనుగంటి సుభాష్‌-పొచ్చుబాయి దంపతుల కుమారుడు హరీష్‌ గ్రామంలో పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురికాగా కిడ్నీల సమస్య ఉందని వైద్యులు సూచించారు. పేద కుటుంబం కావడంతో చికిత్సకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విషయాన్ని తెలుసుకొన్న కాన్వెంట్‌ పాఠశాల యాజమాన్యం ఇటీవల పాఠశాలలో ఆహార మేళా(ఫుడ్‌ఫెస్టివల్‌) నిర్వహించింది. ఇలా వచ్చిన ఆదాయం రూ.1.96 లక్షల నగదును బాధిత విద్యార్థి, తల్లిదండ్రులకు సోమవారం పాఠశాలలో విద్యార్థులు అందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ క్లేర్‌టోం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *