[spt-posts-ticker]

కిడ్నీ బాధితుడి కోసం విరాళాల సేకరణ

తాంసి : మండల కేంద్రంలోని పదో తరగతి చ దువుతున్న విద్యార్థి హరీష్‌  కిడ్నీల ఆపరేషన్‌ కోసం తాంసి యు వకులు కృషి చేస్తున్నారు. బాధితున్ని ఆదుకోవాలంటూ ఇం టిం టికీ తిరుగుతూ విరాళాలు సేకరిస్తున్నారు. గ్రామంలోని జ్ఞానోద య, అభ్యుదయ, అంబేద్కర్‌ సంఘాలకు చెందిన యువకులు ఆ దివారం గ్రామంలో ఇంటింటికీ తిరుగుతు విద్యార్థి సహాయార్థం విరాళాలు పోగు చేశారు.

ఈ సందర్భంగా రాఘవేందర్‌, రాజశేఖ ర్‌ మాట్లాడుతూ.. మానవత దృక్పథంతో ప్రతీ ఒక్కరు సహాయం అందిస్తే ఆ విద్యార్థి మనలో ఒకడిగా నిలచే అవకాశాలున్నాయ న్నారు. విద్యార్థి ఆపరేషన్‌ కోసం సుమారు రూ.10 నుంచి 15 లక్ష లు అవసరం ఉన్నాయని, ఈ పాటికే తాము కొంత పోగు చేశా మని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరు చేయూతనందించాలని కోరారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *