[spt-posts-ticker]

కుక్క కాట్లు లేని నగరమే లక్ష్యం: అమల అక్కినేని

 

బంజారాహిల్స్‌,(ఆరోగ్యజ్యోతి): వీధి కుక్కలనే భావనతో వదిలేయకూడదు, వాటిని స్టెరిలైజ్‌ చేసి, యాంటీ రేబిస్‌ వ్యాక్సినేషన్‌ ఇవ్వాలని బ్లూక్రాస్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ ఛైర్‌పర్సన్‌ అమల అక్కినేని అభిప్రాయపడ్డారు.  బంజారాహిల్స్‌లోని జర్మన్‌ సాంస్కృతిక, అధ్యయన సంస్థ గోతెజంత్రంలో ‘పోర్ట్రైచ్యూర్‌ ఆఫ్‌ కంపాషన్‌’ పేరిట ఛాయాచిత్ర ప్రదర్శన గురువారం ప్రారంభమైంది. ఛాయాచిత్ర గ్రాహకుడు కందుకూరి రమేష్‌ బాబు తీసిన చిత్రాలను ఇందులో ప్రదర్శిస్తున్నారు. అమల అక్కినేని ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి వెలిగించి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుక్కకాట్లు లేకుండా హైదరాబాద్‌ సురక్షితంగా ఉండాలన్నదే తమ సంస్థ లక్ష్యమన్నారు. గోతెజంత్రం డైరెక్టర్‌ అమితా దేశాయ్‌, తదితరులు పాల్గొన్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *