[spt-posts-ticker]

కేజ్రీవాల్‌కు కరోన నెగెటివ్‌ వచ్చింది..

న్యూఢిల్లీ(ఆరోగ్యజ్యోతి): ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించి కరోనా వైరస్‌ సోకలేదని.. నెగెటివ్‌ అని తేల్చారు. గత రెండు రోజులగా గొంతునొప్పి, జ్వరంతో కేజ్రీవాల్‌ బాధపడుతున్నారు. కరోనా వైరస్‌ సోకిందేమోనన్న అనుమానంతో స్వీయ గృహనిర్బంధంలో ఉండిపోయారు. కేజ్రీవాల్‌ నుంచి వైద్యులు నమూనాలు సేకరించి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపేందుకు పంపారు. కాగా, పరీక్షల నివేదికలో నెగెటివ్‌గా తేలడంతో కేజ్రీవాల్‌ ఊపిరిపీల్చుకొన్నారు.ఆదివారం నుంచి మంత్రులతోగానీ, ఆధికారులతోగానీ కేజ్రీవాల్‌ కలువలేదు. గొంతునొప్పి కారణంగా ఎవరితో మాట్లాడలేదు. ‘ముఖ్యమంత్రి ఆరోగ్యం బాగాలేదని, స్వీయ నిర్బంధంలోకి వెళ్లారని, దగ్గు, గొంతునొప్పితో బాధపడుతున్నారని’ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా సోమవారం వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, సామాజిక వ్యాప్తి, ప్రైవేట్‌ దవాఖానలపై చర్చించడానికి మనీశ్‌ సిసోడియా నేతృత్వంలో మంత్రిమండలి సమావేశం జరిగింది.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *