[spt-posts-ticker]

కేన్సర్‌ను ముందే గుర్తిస్తే నయం

అపోలో కేన్సర్‌ కాన్‌క్లేవ్‌ ప్రారంభ సభలో గవర్నర్‌ తమిళిసై

ప్రతి ఏడాది రాష్ట్రంలో  లక్ష కేన్సర్‌ కేసులు: ఈటల

హైదరాబాద్‌ ): కేన్సర్‌ను ప్రాఽథమిక దశలోనే గుర్తిస్తే చికిత్సతో సులభంగా నయం చేయవచ్చని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెలిపారు. 35 ఏళ్లు దాటిన వారంతా ప్రతి ఏడాది ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. శుక్రవారం హెచ్‌ఐసీసీలో అపోలో కేన్సన్‌ కాన్‌క్లేవ్‌ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆయుష్మాన్‌ భారత్‌ పఽథకం ద్వారా కేంద్రం, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేన్సర్‌ బాధితులను ఆదుకుంటున్నాయని గవర్నర్‌ చెప్పారు. ప్రంపంచ వ్యాప్తంగా ఉన్న వైద్యులు, నిపుణులు తమ పరిశోధనలను ఇతరులతో పంచుకునేందుకు వివిధ రంగాల్లో నిపుణులైన వైద్యుల సూచనలు పొందే అవకాశం కేన్సర్‌ కాన్‌క్లేవ్‌ ద్వారా కలుగుతుందన్నారు. అనంతరం మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి మస్కట్‌ను ఆవిష్కరించారు.

కేన్సర్‌, మధుమేహం, హృద్రోగాల కారణంగానే 60 శాతం మరణాలు సంభవిస్తున్నాయని ఈటల తెలిపారు. ప్రతి ఏడాది రాష్ట్రంలో లక్ష కేన్సర్‌ కేసులు నమోదవుతున్నాయని, వాటిలో మహిళలు ఎక్కువ శాతం ఉన్నారన్నారు. ఏటా ప్రభుత్వం కేన్సర్‌ చికిత్స కోసం రూ.100 కోట్లు ఖర్చుపెడుతుందని తెలిపారు. కేన్సర్‌ చికిత్సలో అపోలో ఆస్పత్రి అత్యాధునిక వైద్య పద్ధతులను అందుబాటులోకి తెచ్చిందని అపోలో వైస్‌ చైర్‌పర్సన్‌ ప్రీతారెడ్డి తెలిపారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *