[spt-posts-ticker]

కేసీఆర్ ఆపద్బంధు వస్తోంది

హైదరాబాద్ : కేసీఆర్ ఆపద్బంధు వస్తోంది

 

  • కొత్తగా అంబులెన్సుల పథకం..
  • తద్వారా యువతకు ఉపాథి
  • ఐదుగురితో ఓ గ్రూప్‌… వారికి ఓ వాహనం
  • ఫైలెట్‌ ప్రాజెక్టుగా జిల్లాకు ఒకటి…
  • బీసీ సంక్షేమశాఖ నిర్ణయం
  • మంత్రి గంగుల సమీక్ష

తెలంగాణలో మరో కొత్త పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఈ కొత్త పథకానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పేరు పెట్టాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయం తీసుకుంది. యువతకు ఉపాధి కల్పించేందుకుగాను ‘కేసీఆర్‌ అపద్భందు’ పేరుతో అంబులెన్స్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు కూడ మొదలైనాయి. కేసీఆర్‌ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అభివృద్ధి, సంక్షేమ పథకాలను శరవేగంగా ప్రభుత్వం అమలు చేస్తున్నది. అదే పంథాను వచ్చే నాలుగేళ్లు కొనసాగించేలా పథకాలను రూపొందిస్తున్నారు. ఈ దిశగా యువతకు పెద్దఎత్తున ఉపాధి కల్పించే ఉద్దేశ్యంతో తన పేరిట కొత్త పథకానికి రూపకల్పన చేశారు. కేసీఆర్‌ అపద్బంధు పథకంకింద ఐదుగురు ఎంబీసీ యువకులను ఒక గ్రూప్‌గా తీసుకుని అంబులెన్స్‌లు పంపిణి చేయలని నిర్ణయించారు. అంబులెన్స్‌లకు సంబంధించిన నిధులను ఈ బడ్జెట్‌లో కేటాయించాలని, అందుకు తగిన ప్రణాళికను రూపొందించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ సంబంధిత అధికారులకు సూచించారు. ఫైలెట్‌ ప్రాజెక్టుగా జిల్లాకు ఒకటి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత అన్ని మండల కేంద్రాల్లో విస్తరించే విధంగా విధి విధానాలను రూపొందించాలనే నిర్ణయానికి వచ్చారు. గురువారం డీఎస్‌ఎస్‌ భవన్‌లో మంత్రి గంగుల కమలాకర్‌ బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంబీసీ కులాలకు ఉపాధి అవకాశం కల్పించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ‘కేసీఆర్‌ ఆపద్బంధు’ పేరుతో అంబులెన్సులను బీసీ కార్పొరేషన్‌ ద్వారా అందించాలని, ఒక్కో గ్రూప్‌లో 5గురు ఉండే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. 10 వేల మంది నిరుపేద బీసీ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కుట్టు మిషన్లు అందజేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అందుకు ముందుగానే మహిళలకు తగు శిక్షణ ఇప్పించి కుట్టు మిషన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. చదువుకున్న నిరుద్యోగ యువతులకు నిప్ట్‌ ( ఎన్‌.ఐ.ఎఫ్‌. టి ) ద్వారా శిక్షణ ఇప్పించి తగు ఉపాధిని కల్పించాలని నిర్ణయించారు. వెనుకబడిన వర్గాలకు చెందిన 11 ఫెడరేషన్ల ద్వారా వివిధ కులాల వృత్తుల వారికి వారి వారి రంగాల్లో ఉపాధి కల్పించాలని, కేసీఆర్‌ కలలు గన్న బంగారు తెలంగాణ సాధించుటకు కృషి చేయాలని మంత్రి సూచించారు.
బీసీ విద్యార్థుల భవిష్యత్‌ కొరకు ప్రతి ఒక్కరు కలిసి పని చేయాలని సంబంధిత శాఖ అధికారులకు మంత్రి గంగుల సూచించారు. పట్టణ ప్రగతిలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు బీసీ హాస్టళ్లను సందర్శించాలన్నారు. త్వరలోనే సంక్షేమ హాస్టళ్ల పరిశీలన, వాటి ప్రగతి కొరకు చేపట్టాల్సిన పనుల విషయంపైన ప్రత్యేక కార్యాచరణ చేపట్టను న్నట్లు తెలిపారు. పరీక్షల సమయం సమీపిస్తున్నం దున మహోత్మ జ్యోతిబా పూలే, సంక్షేమ హాస్టళ్లలో మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. తాను అన్ని జిల్లాలలోని సంక్షేమ హాస్టళ్లను సందర్శించి పరిస్థితులను అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ వెనుకబడి వర్గాల ప్రజల అభివృద్ధి, విద్య కోసం ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి గుర్తు చేశారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి. వెంకటేశం, అడిషన్‌ కార్యదర్శి సైదా, బీసీ కార్పోరేషన్‌ ఎండీ లోకేష్‌కుమార్‌, బీసీ గురుకులాల కార్యదర్శి మల్లయ్య బట్టుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *