[spt-posts-ticker]

కొవిడ్‌కు ప్రత్యేకంగా 602 ఆస్పత్రులు

  • దేశంలో 10 వేలు దాటిన కేసులు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 14: కరోనా రోగులకు చికిత్స అందించేందుకు 602 ఆస్పత్రులను ప్రత్యేకంగా కేటాయించామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ ఆస్పత్రుల్లో 1,06,719 ఐసొలేషన్‌బెడ్‌లు, 12,024 ఐసీయూ బెడ్‌లు ఉన్నాయని పేర్కొంది. ‘‘దేశవ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 1,463కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారిన పడిన మరో 29 మంది మృతిచెందారు. మొత్తం కేసులు 10,815కు, మరణాలు 353కు పెరిగాయి’’ అని మంగళవారం ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. 160 మరణాలు మహారాష్ట్రలోనే సంభవించాయ న్నారు. మధ్యప్రదేశ్‌లో 43, ఢిల్లీలో 28, గుజరాత్‌లో 26 మంది మృతిచెందారని చెప్పారు. ఇప్పటి వరకు 1,035 మంది కోలుకుని, డిశ్చార్జి అయ్యారని వివరించారు. ఐసీఎంఆర్‌ లెక్కల ప్రకారం… ఇప్పటి వరకు 2.31 లక్షల నమూనాలను పరీక్షించారు.

సోమవారం ఒక్క రోజే పరీక్షలు నిర్వహించిన నమూనాల సంఖ్య 21,635. అహ్మదాబాద్‌లో 2,000 పడకల సామర్థ్యంతో దేశంలోనే అతి పెద్ద కొవిడ్‌-19 కేర్‌ సెంటర్‌ సిద్ధమైంది. గుజరాత్‌లో కొత్తగా 45 కేసులు నమోదయ్యాయి. వీటిలో 31 కేసులు అహ్మదాబాద్‌లోనే వెలుగుచూశాయి. కేరళలో వరుసగా రెండో రోజు కొత్తగా నమోదైన కేసుల కంటే ఎక్కువ మంది కోలుకొన్నారు. కర్ణాటకలో మంగళవారం ఒక్కరోజే రాష్ట్రంలో 13 కేసులు నమోదయ్యాయి. కాగా, కరోనా సంక్షోభంలో మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న వారికి భరోసా కల్పించేందుకు అసోం ప్రభుత్వం కృషిచేస్తోంది. ఈ ప్రయత్నంలో భాగస్వాములయ్యేందుకు 13,500 మంది వలంటీర్లు పేర్లు నమోదు చేసుకున్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *