[spt-posts-ticker]

కొవిడ్ పాజిటివ్ గ‌ర్భిణీ ముగ్గురు శిశువుల‌కు జ‌న్మ‌నిచ్చింది

  • ముగ్గురు శిశువులకు జన్మనిచ్చిన కరోనా పాజిటివ్‌ మహిళ
  • తాజా పరీక్షల్లో అందరికీ నెగెటివ్‌గా నిర్ధారణ 
  • తల్లీబిడ్డలు క్షేమంగా ఇంటికి..

నిజామాబాదు(ఆరోగ్యజ్యోతి): ప్రభుత్వ దవాఖానలో కరోనా సోకినా గర్భిణి ముగ్గురు పిల్లలకు జన్మ నిచ్చిందని జిల్లా ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్‌ ప్రతిమారాజ్‌ తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కోటగిరికి చెందిన నస్రీమ్‌బేగం అక్టోబర్‌ 21న కాన్పు కోసం ప్రభుత్వ దవాఖానకు తీసుకువచ్చారని, ఆమెకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు.  కొవిడ్‌ చికిత్స ప్రారంభించిన వెంటనే డెలివరీ చేయగా ముగ్గురు పిల్లలు జన్మించారని తెలిపారు. ఇందులో ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడబిడ్డ ఉన్నారని, వీరికి కరోనా పరీక్షలు  నిర్వహించగా నెగెటివ్‌ వచ్చిందన్నారు. ప్రస్తుతం బాధితురాలు సైతం కరోనా నుంచి పూర్తిగా కోలుకుందని తెలిపారు.  కరోనా బాధితురాలికి  ప్రసవం చేసిన గైనిక్‌ విభాగం వైద్యులను ఈ సందర్భంగా సూపరింటెండెంట్‌ అభినందించారు. సమావేశంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ బాల్‌రాజు, డాక్టర్లు సుధా, శ్వేత, హరిచంద్రారెడ్డి, వెంకట్‌, సరస్వతి, శ్రీదేవి, కవిత, గోపాల్‌సింగ్‌, దీపక్‌, సదాశివ్‌ పాల్గొన్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *