[spt-posts-ticker]

కోవిడ్ పడకలన్ని ఖాళీ!

తగ్గుతున్న కరోనా కేసులు

ఆస్పత్రుల సంఖ్య 248 నుంచి 169కి తగ్గుముఖం

సాధారణ పడకలూ వేలల్లో ఖాళీ

 అమరావతి(ఆరోగ్యజ్యోతి) :  రాష్ట్రంలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతోంది. ఈ విషయాన్ని ఖాళీగా ఉన్న పడకలే రుజువు చేస్తున్నాయి. ఒకప్పుడు రోజుకు సగటున 40 వేల పడకల్లో కరోనా బాధితులుండేవారు. ఇప్పుడు వాటి సంఖ్య ఐదు వేలకు పడిపోయింది. మరోవైపు కరోనా ఆస్పత్రుల సంఖ్యా గణనీయంగా తగ్గింది. మొన్నటి దాకా ప్రభుత్వ, ప్రయివేటులో కలిపి 248 ఆస్పత్రులను కోవిడ్‌ సేవల కోసమే వినియోగించగా, ఇప్పుడా ఆస్పత్రుల సంఖ్యను 169కి తగ్గించారు. మరోవైపు మృతుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. ఒక దశలో రోజుకు 90 మంది కూడా మరణించిన రోజులున్నాయి. ప్రస్తుతం మరణాలు 10కి తగ్గింది.

కేసులే కాదు.. తీవ్రతా తగ్గింది!
కేసులు తగ్గుముఖం పట్టడమే కాదు తీవ్రత కూడా తగ్గినట్టు నిపుణులు చెబుతున్నారు. కేవలం కోవిడ్‌ కేర్‌ సెంటర్లలోనే 16,134 పడకలుండగా, 1,882 పడకల్లో మాత్రమే బాధితులున్నారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో కోవిడ్‌ చికిత్సకు కేవలం నాలుగు ఆస్పత్రులే ఉన్నాయి. వెంటిలేటర్‌పై చికిత్స అందించాల్సిన కేసులు పూర్తిగా తగ్గిపోయాయి. అన్‌స్టేబుల్‌.. అంటే కరోనాతో విషమ పరిస్థితుల్లో ఉన్న వారి సంఖ్య జీరోగా ఉంది. పడకలు లేదా చికిత్సకు సంబంధించి 104 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేయగానే బాధితులకు తక్షణమే సాయం, వారు అడిగిన వివరాలు అందిస్తున్నారు. ఎక్కువ మంది బాధితులు వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రులవైపే మొగ్గుచూపుతున్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *