[spt-posts-ticker]

కోవిద్ -19 టెస్టులు ఏఎన్ఎంలు చేయాలనడం సరికాదు

  • పారామెడికల్ సిబ్బందిని టెస్ట్ ల నుంచి మినహాయించాలి

  • ప్రస్తుత తరుణంలో ల్యాబ్ టెక్నీషియన్ ల ను నియమించాలి

  • TMPHEU(H1) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కర్నాటిక్ సాయి రెడ్డి 

హైదరాబాద్, ఆరోగ్యజ్యోతి: కోవిద్-19, టెస్టు లు ఏఎన్ఎంలు చేయాలని. వివిధ జిల్లాలో  , జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన సమావేశాల్లో అధికారులు ఆదేశాలు జారీ చేయడం సరికాదని తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయిస్. H1 యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కర్నాటి సాయి రెడ్డి అన్నారు.  క్షేత్రస్థాయిలో ఇప్పటికే , ఏఎన్ఎంలు 36 రకాల రికార్డ్స్,. రాయాలి, ఆన్ లైన్  వర్క్ చేస్తున్నారని దీనితో చాల ఇబ్బందులు పడుతూ చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారని దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కోవిద్-19, టెస్టు లు ఏఎన్ఎంలు చేయాలనే ఉద్దేశాన్ని మానుకోవాలని అయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. వైద్య ఆరోగ్య శాఖ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల సబ్ సెంటర్ లో పనిచేస్తున్న మొదటి రెండవ ఏఎన్ఎంలను  గమనించినట్లయితే ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విధులు నిర్వహించాల్సి వస్తుంది. రోజువారి వైద్య శిబిరాలు, మాతాశిశు సంరక్షణ ,కెసిఆర్ కిట్, గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు, వారం వారం గ్రామాల్లో సమావేశాలు, పాఠశాల పిల్లలకు వైద్య శిబిరాలు, ఆస్పత్రిలో ప్రసూతి అయ్యే విధంగా చూసే బాధ్యత కూడా వీరి పైనే ఉంది. ఇవి కాకుండా గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా ఇతర ఆస్పత్రుల్లో చేయించడం,నెలనెలా మీటింగ్స్  రిపోర్టు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తో పాటు ఇతర ప్రోగ్రాం అధికారులు కూడా సమావేశాలు వెళ్ళడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇబ్బందులు పడుతున్నరు.అలాగే ఎన్ సి డి సర్వే, మాత శిశు ఆన్ లైన్ చేయడం, ఇమ్యునైజేషన్ ఆన్ లైన్  చేయడం, కెసిఆర్ కిట్  ఆన్ లైన్  చేయడం, దీనితో పాటు మీటింగ్స్ ఎన్నోఇబ్బందులు పడుతున్నారని అయన తెలిపినారు. ఎన్ని పనులు చేస్తూ  వెట్టి  చాకిరి లు చేస్తున్న ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు . కోవిద్- 19  టేస్ట్ ల కోసం రాష్ట్రవ్యాప్తంగా కాలిగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్లు భర్తీ చేసి వారి చే టెస్టులు  చేయించాలని ప్రభుత్వాన్ని కోరారు .ఇవి కాక ల్యాబ్ టెక్నీషియన్లు చేయవలసిన కోవైడ్-19,టెస్టులు కూడ ANM’s చేయాలని  అధికారులు ఆదేశాలు ఇవ్వడం సరైన విధానం కాద న్నారు. వైద్య ఆరోగ్య శాఖలో కిందిస్థాయి సిబ్బంది పట్ల బెదిరింపు ధోరని పాల్పడడం అధికారులు మానుకోవాలని హితవు పలికారు. కోవిద్ 19 డ్యూటీ లో పాల్గొన్న వైద్య ఆరోగ్య సిబ్బంది కి 10% ఇన్సెంటివ్  ను రెండు నెలలది మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. నాలుగు నెలలుగా ప్రత్యేక ఇన్సెంటివ్ ఇవ్వడం లేదని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల్లో పని చేయాలంటేనే జంకుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. బలవంతము బెదిరింపులకు పాల్పడి  కోవిద్ 19డ్యూటీలు చేయిస్తే తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయిస్H1 యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *