న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న క్యాన్సర్ ఆస్పత్రిలో కరోనా వైరస్ కలకలం రేపింది. గత వారంలో క్యాన్సర్ ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ వైద్యురాలికి.. ఆమె సోదరుడి నుంచి కరోనా సోకిన విషయం విదితమే. ఆ తర్వాత మరో ఆరుగురు నర్సులకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆస్పత్రిని మూసివేశారు. తాజాగా ఇదే ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ డాక్టర్‌కు, 11 మంది నర్సులకు కరోనా పాజిటివ్ వచ్చింది. క్యాన్సర్ ఆస్పత్రిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18కి చేరింది. క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న 19 మంది రోగుల రక్త నమూనాలను కూడా ల్యాబ్‌కు పంపారు. ఈ నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది. క్యాన్సర్ ఆస్పత్రిలో పని చేస్తున్న 45 మంది సిబ్బందిని క్వారంటైన్లో ఉంచారు.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]