[spt-posts-ticker]

క్యాలీఫ్లవర్‌తో కాలేయానికి పవర్‌! ఫ్యాటీ లివర్‌ వ్యాధిపై పోరుకు సాయం

 

హ్యూస్టన్‌: మనం విస్తృతంగా వినియోగించే క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌ వంటి కూరగాయల్లో సహజసిద్ధంగా ఉన్న ఒక పదార్థానికి ఫ్యాటీ లివర్‌ వ్యాధిని ఎదుర్కొనే సామర్థ్యం ఉందని తాజా అధ్యయనం తేల్చింది. ఈ వ్యాధి నివారణకు కొత్త మార్గాలను సాకారం చేసే దిశగా ఇది వీలు కల్పిస్తుందని వివరించింది. నాన్‌ ఆల్కాహలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌ (ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీ) వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. ఆహారంలో సంతృప్త కొవ్వులను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇది తలెత్తవచ్చు. దీనికి చికిత్స చేయకుంటే సిరోసిస్‌ లేదా కాలేయ క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీయవచ్చు. ఫ్యాటీ లివర్‌ వ్యాధి వ్యాప్తిపై పేగుల్లోని సూక్ష్మజీవులు ప్రభావం చూపుతాయి. ఇవి అనేక పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. వాటిలో ఇండోల్‌ ఒకటి. ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీ నివారణ, చికిత్సకు ఈ పదార్థం ఉపయోగపడుతుందని తేలింది. క్యాలీఫ్లవర్‌, క్యాబేజీ కుటుంబానికి చెందిన కూరగాయల్లోనూ ఇండోల్‌-3-కార్బినాల్‌ ఉంది. దానికీ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, క్యాన్సర్‌ పోరాట సామర్థ్యం ఉన్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఊబకాయం ఉన్నవారి రక్తంలో ఇండోల్‌ స్థాయి తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ పదార్థం తక్కువగా ఉంటే కాలేయంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతున్నట్లు తేల్చారు.

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *