[spt-posts-ticker]

క్వారంటైన్‌లో 39 మంది వైద్య సిబ్బంది

ఢిల్లీ : క‌రోనా  పాజిటివ్ వ‌చ్చిన ఇద్ద‌రు రోగుల‌ను ప‌రీక్షించిన 39 మంది వైద్యసిబ్బందిని  సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లాల్సిందిగా హాస్సిట‌ల్ మేనేజ్‌మెంట్ కోరింది. ఆసుప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించిన స‌మాచారం ప్ర‌కారం..గుండె చికిత్స కోసం హాస్పిట‌ల్‌కు చేరిన ఇద్ద‌రు క‌రోనా ల‌క్ష‌ణాలతో బాధ‌ప‌డ‌టంతో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా క‌రోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వారిద్ద‌రిని ప‌రీక్షించిన వైద్య‌సిబ్బందిని స్వీయ నిర్భందంలోకి వెళ్లారు. వీరిలో ప్రైవేటు వైద్యులు, వార్డు సిబ్బంది కూడా ఉన్నారు. వీరంద‌రి ఫ‌లితాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే సాకేత్ హాస్పిట‌ల్‌లో ప‌నిచేస్తున్న మొత్తం 154 ఉద్యోగుల్లో ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రికి క‌రోనా సోక‌లేద‌ని ఆస్ప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి. అంత‌కుముందు, ఎయిమ్స్‌ కార్డియో న్యూరో సెంట‌ర్‌లో నాడీ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో వ‌చ్చిన 72 ఏళ్ల వ్య‌క్తికి క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో వైద్యులు, నర్సులు స‌హా 30 మంది సిబ్బంది స్వీయ నిర్భందంలోకి వెళ్లారు. దీంతో చాలా ఆసుప‌త్రుల్లో  వైద్య సిబ్బందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *