[spt-posts-ticker]

క‌రోనా కార‌ణంగా నితిన్ పెళ్లి వాయిదా ప‌డ‌నుందా

నాగర్‌కర్నూల్‌లోని ప్రగతి నర్సింగ్‌ హోమ్‌ నిర్వహిస్తున్న డాక్టర్‌ సంపత్‌కుమార్‌, నూర్జహాన్‌ దంపతుల రెండవ కుమార్తె షాలినితో ఇటీవ‌ల‌ నితిన్‌కు నిశ్చితార్థం జరిగిన విష‌యం తెలిసిందే.  దుబాయ్‌లోని ప్రఖ్యాత హోటల్  పలాజో వర్సాచీ లో  ఏప్రిల్‌ 16న వివాహం జ‌ర‌గ‌నుంద‌ని అన్నారు.  కాని ప్ర‌స్తుతం క‌రోనా ప్రపంచం మొత్తాన్ని వ‌ణికిస్తున్న‌నేప‌థ్యంలో నితిన్ వివాహ వేడుక వాయిదా ప‌డే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా అరబ్‌ దేశాల్లో కఠినమైన ఆంక్షలు నెలకొన్న నేపథ్యంలో నితిన్ పెళ్ళి కొద్ది రోజుల పాటు వాయిదా ప‌డొచ్చు. లేదంటే అనుకున్న ముహూర్తానికే హైద‌రాబాద్‌లోని ఫాం హౌజ్‌లో నితిన్ వివాహం జ‌రిపే ఏర్పాట్లు చేస్తున్నారు . ఇక  ఏప్రిల్‌ 21న హైటెక్స్‌లో గ్రాండ్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేయాలని కూడా వ‌ధూవ‌రుల త‌ల్లితండ్రులు నిర్ణయించినట్లు తెలిసింది. భీష్మ చిత్రంతో మంచి హిట్ కొట్టిన నితిన్ త్వ‌ర‌లో రంగ్‌దే చిత్రంతో పాటు మ‌రి కొన్ని ప్రాజెక్ట్‌ల‌ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నాడు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *