[spt-posts-ticker]

క‌రోనా చితాభ‌స్మం నుంచి ఫీనిక్స్‌లా లేచాం : జ‌్యోతిరాధిత్య సింథియా

 

న్యూఢిల్లీ:  రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానం సంద‌ర్భంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌లో ఇవాళ రాజ్య‌స‌భ‌లో బీజేపీ ఎంపీ జ్యోతిరాధిత్య సింథియా మాట్లాడారు. 2020 సంవ‌త్స‌రం ప్ర‌పంచ దేశాల‌కు ఓ స‌వాల్‌గా నిలిచింద‌న్నారు. కానీ కోవిడ్ కేసులు త‌గ్గుతున్న తీరు చూస్తుంటే.. కొత్త ఉత్తేజం వ‌చ్చిన‌ట్లు ఉంద‌న్నారు.  కరోనా వైర‌స్ చితాభ‌స్మం నుంచి  భార‌త దేశం ఫీనిక్స్ ప‌క్షి త‌ర‌హాలో లేచి వ‌చ్చిన‌ట్లు సింథియా అన్నారు.  ప్ర‌పంచ దేశాల‌తో పోలిస్తే భార‌త్‌లో కోవిడ్ రిక‌వ‌రీ రేటు అధికంగా ఉంద‌న్నారు.  ప్ర‌ధాని మోదీ ప్ర‌భుత్వంపై సింథియా ప్ర‌శంస‌లు కురిపించారు.  స‌రైన స‌మ‌యంలో చ‌ర్య‌లు తీసుకోవ‌డం వ‌ల్లే దేశం మ‌ళ్లీ కోలుకుంద‌న్నారు. క‌రోనా వేళ అమ‌లు చేసిన లాక్‌డౌన్‌ను.. 1975 నాటి ఎమ‌ర్జెన్సీ క‌న్నా బెట‌ర్ అన్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.  క‌రోనా మ‌హ‌మ్మారి వేళ దేశంలో లాక్‌డౌన్ విధించాల్సి వ‌చ్చింద‌ని, ఒక వ్య‌క్తి సూచ‌న మేర‌కు లాక్‌డౌన్ పాటించామ‌ని, కానీ 1975లోనూ దేశంలో లాక్‌డౌన్ ప‌రిస్థితులు వ‌చ్చాయ‌ని, అప్పుడు దేశాన్ని ఓ జైలులా మార్చార‌ని సింథియా ఆరోపించారు. 

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *