బలిజిపేట (ఆరోగ్యజ్యోతి): పార్వతీపురం డివిజన్ పరిధిలోని సాలూరు, కొమ్ము లక్ష్మీపురం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గర్భిణి వసతిగృహాల వల్ల మహిళలకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని ఉప వైద్యశాఖాధికారి ఎమ్. రవికుమార్ రెడ్డి తెలిపారు. బలిజిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన అకస్మికంగా సందర్శించారు. కార్యాలయం దస్త్రాలను, మందుల నిల్వలను పరిశీలించారు. వసతిగృహాల ఏర్పాటు అనంతరం ఈ ఏడాది 650 మంది గర్భిణిలకు మెరుగైన వెద్యసేవలు అందించినట్లు చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో రక్తహీనత ఉన్న 23 మంది విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించామన్నారు. కార్యక్రమంలో బలిజిపేట ప్రభుత్వ వైద్యాధికారి యు. మహిపాల్, సామాజిక ఆరోగ్యాధికారి ఎస్వి రమణ పాల్గొన్నారు.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]