అనంతపురం,(ఆరోగ్యజ్యోతి): పయ్యావుల సేవాసమితి ఆధ్వర్యంలో పయ్యావుల సేవాసమితి అధ్యక్షులు చందు నాయక్ అద్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ లో 50 మంది గర్భిణీలకు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పయ్యావుల సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు చందు నాయక్ మాట్లాడుతూ తల్లి ఆరోగ్యంగా వుంటేనే పుట్టబోయే బిడ్డ బాగుంటాడు అనే నినాదంతో అమ్మకడుపు చల్లగా ఉండాలని పయ్యావుల సేవాసమితి ఆధ్వర్యంలో ఈరోజు 50 మంది గర్భీణీ మహిళలకు ఆపిల్ ఫ్రూట్స్ అందించడం జరిగిందని అన్నారు . ఇలా అమ్మతనానికి నిలయమైన ఎందరో గర్భీణీలకు నాకు సేవ చేసే అవకాశం వచ్చినందుకు నా అదృష్టంగా భావిస్తున్నాను అని ఆయన తెలిపినారు. ఈ కార్యక్రమంలో ఫక్రుద్దీన్ వలి ధను టోపి భాష తదితరులు పాల్గొన్నారు
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]