[spt-posts-ticker]

గాంధీ’కి కరోనా అనుమానితురాలు ఉస్మానియా నుంచి తరలింపు

ఉస్మానియా : ‘కరోనా’ అనుమానిత మహిళను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి నుంచి గాంధీకి తరలించారు. ఆమె దగ్గు, వాంతులు తదితర లక్షణాలతో బాధపడుతున్నట్లు డ్యూటీ ఆర్‌ఎంవో డా.సిద్దిఖీ తెలిపారు. ముషీరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన ఓ మహిళ(55) ఇటీవల పవిత్ర పుణ్యక్షేత్రం ఉమ్రాకు వెళ్లి వచ్చారు. కొన్ని రోజులుగా దగ్గు తగ్గకపోవడం, వాంతులు వంటి లక్షణాలతో బాధపడుతూ నల్లకుంట ఫీవర్‌ ఆసుపత్రి తదితర దవాఖానాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో ఈ నెల 9వ తేదీన గాంధీ ఆసుపత్రికి వెళ్తే.. అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి ఉస్మానియాకు వెళ్లాల్సిందిగా సూచించారు. ఈ నెల 14న ఉస్మానియాలో చేరారు. కరోనా వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నట్లు ఇక్కడి వైద్యులు నిర్ధరించారు. విషయం తెలుసుకున్న సూపరింటెండెంట్‌ డా.నాగేందర్‌, డ్యూటీ ఆర్‌ఎంవో డా.సిద్దిఖీ బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. అనంతరం ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *