[spt-posts-ticker]

గ్లకోమా నుంచి విముక్తి కోసం

కంటి చూపును కబళించే గ్లకోమా నుంచి విముక్తి కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.గ్లకోమా కంటి నరాలకు సంబంధించిన వ్యాధి. కంటి నరాల్లో పీడనం పెరిగితే ఇది వస్తుంది. ఈ వ్యాధి ప్రారంభంలో పాక్షికంగా దృష్టిలోపం కలుగుతుంది. దానిని నిర్లక్ష్యం చేసి, సరైన చికిత్స తీసుకోకపోతే కొన్నాళ్లకు పూర్తిగా కంటిచూపు పోతుంది. చాలా కారణాలవల్ల వచ్చే ఈ వ్యాధిలో రకాలు కూడా ఎక్కువే ఉన్నాయి. గ్లకోమాను నియంత్రించే అవకాశాలు లేకపోయినా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి
– వంశపారంపర్యంగా గ్లకోమా వచ్చే అవకాశం ఉన్న వ్యక్తులు క్రమం తప్పక వైద్యుల చేత కంటి పరీక్షలు చేయించుకోవాలి.
– ఒక కంటిని మూసి ఉంచి రెండో కంటిచూపును పరీక్షించుకోవాలి. ఇలా రెండు కళ్లనూ స్వీయ పరీక్ష చేసుకుంటూ గ్లకోమాను ప్రారంభ దశలోనే గుర్తించే ప్రయత్నం చేయాలి.
– స్టెరాయిడ్స్‌ వాడకాన్ని వీలైనంత తగ్గించాలి.
– కళ్లను బాధించే చిన్న చిన్న రుగ్మతలకు వైద్యుల ప్రమేయం లేకుండా స్టెరాయిడ్‌ కలిగిన చుక్కల మందులు వాడేయకూడదు.
– మధుమేహులు చక్కెర స్థాయిల్ని అదుపులో ఉంచుకోవాలి.
– కళ్లకు దెబ్బలు తగలకుండా కాపాడుకోవాలి.
– టపాసులు కాల్చేటప్పుడు నిప్పు రవ్వలు కంట్లో పడకుండా చూసుకోవాలి. ఈ ప్రమాదాల వల్ల కూడా కళ్లల్లో గ్లకోమా రావొచ్చు.
– షటిల్‌ ఆడేటప్పుడు కాక్‌ కంటికి తగలటం, క్రికెట్‌ ఆడేటప్పుడు బాల్‌ బలంగా కంటిని తాకితే గ్లకోమా వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఇలాంటి ఆటలాడేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
– రక్తపోటు, హైపర్‌ టెన్షన్‌లను అదుపులో ఉండేలా చూసుకోవాలి.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *