[spt-posts-ticker]

చిన్నమండవలో ఉచిత వైద్య శిబిరం

చింతకాని, (ఆరోగ్యజ్యోతి): : చింతకాని మండలం చిన్నమండవలో ఎన్‌ఎస్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ విద్యార్థులు వారం రోజుల పాటు గ్రామంలో సేవ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి, ఆరోగ్య పరిరక్షణ పట్ల గ్రామస్థులకు అవగాహన కల్పించారు. మండల వైద్యాధికారి డా.నాగేశ్వర్‌రావు రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటరామమ్మ, ఎన్ఎస్ఎస్ జిల్లా కార్యక్రమ అధికారి జీవన్ కుమార్,  ఉపసర్పంచ్ వీరబాబు, సీహెచ్‌వో వీరేందర్, ఆరోగ్య పర్యవేక్షకులు కృష్ణారావు పాల్గొన్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *