[spt-posts-ticker]

చిన్నారులు ఆరోగ్యంగా జన్మించేది అప్పుడే: ఈటల

చిన్నారులు ఆరోగ్యంగా జన్మించేది అప్పుడే: ఈటల

హైదరాబాద్‌: దేశంలో సుమారు 5 శాతం మంది ప్రజలు అరుదైన జన్యుపరమైన వ్యాధులతో బాధ పడుతున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. ప్రపంచ అరుదైన వ్యాధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లో ఇండియన్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ రేర్‌ డిసీజెస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గర్భిణులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన చిన్నారులు జన్మిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. అరుదైన వ్యాధులను నివారించడం కష్టమైనప్పటికీ ప్రయత్నించవచ్చని చెప్పారు. అరుదైన వ్యాధుల కారణంగా నిరుపేదలే ఎక్కువగా బాధపడుతున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలను ఆరోగ్యవంతంగా ఉంచేందుకు పలు కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి తెలిపారు.

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *