హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): పొరుగు దేశమైన చైనాను గడగడలాడిస్తున్న అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ (కోవిడ్- 19) వ్యాధి నుంచి రక్షణ కల్పించే కొన్ని వైద్య ఉపకరణాలను సరఫరా చేసేందుకు మనదేశానికి చెందిన కేంద్ర ప్రభుత్వ విభాగమైన ఫార్మాసూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఫార్మాగ్జిల్) ముందుకు వచ్చింది. దాదాపు లక్ష మంది ప్రజలకు సరిపోయే వైద్య ఉపకరణాలను చైనాలోని షాంగై, బీజింగ్ నగరాలకు పంపుతున్నట్లు ఫార్మాగ్జిల్ డైరెక్టర్ జనరల్ రావి ఉదయ భాస్కర్ ఇక్కడ వెల్లడించారు. ఈ ఉపకరణాల్లో ఫేస్ మాస్క్లు, చేతి గ్లౌజులు, ఇతర పరికరాలు ఉన్నాయి. చైనాలోని భారత దౌత్య కార్యాలయం ఇచ్చిన పిలుపు మేరకు వీటిని మనదేశంలోని వైద్య ఉపకరణాల తయారీ సంస్థల నుంచి సేకరించినట్లు ఆయన వెల్లడించారు. కష్టకాలంలో ఎంతోకొంత మేరకు పొరుగుదేశానికి అండగా నిలవాలనేది తమ ప్రయత్నమని ఉదయ భాస్కర్ పేర్కొన్నారు.
చైనాకు ‘ఫార్మాగ్జిల్’ వైద్య ఉపకరణాలు
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]