[spt-posts-ticker]

చైనాలో పడిపోతున్నబర్త్ రేట్.. తగ్గుతున్నపిల్లలు

జనాభా అంటేనే ఫస్ట్‌‌ గుర్తొచ్చేది చైనా. పాపులేషన్‌‌లో నంబర్‌‌ వన్‌‌ ప్లేస్‌‌ ఈ డ్రాగన్‌‌ కంట్రీదేనని అందరికీ తెలుసు. ఆ జనాభాను తగ్గించేందుకు 1979లో ఆ దేశ ప్రభుత్వం ‘ఒకే బిడ్డ’ చట్టాన్ని చేసింది. ఆ చట్టాన్ని అతిక్రమించినోళ్లకు ఫైన్లు వేసింది. ఉద్యోగాలు రాకుండా చేసింది. రెండో బిడ్డ కడుపులో పడితే బలవంతపు అబార్షన్లనూ చేయించింది. ఇప్పుడు అదే చైనా కొంప ముంచుతోంది. ఎందుకంటే ఆ దేశంలో బర్త్​రేట్​ దారుణంగా పడిపోతోంది. 2019లో పిల్లల పుట్టుక రేటు బాగా తగ్గిపోయింది. 1949 చైనా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా అతి తక్కువ జననాలు నమోదైంది ఆ ఏడాదిలోనే. నేషనల్​ బ్యూరో ఆఫ్​ స్టాటిస్టిక్స్​ ప్రకారం ప్రతి వెయ్యి మందికిగానూ కేవలం 10.48 మంది పిల్లలే అక్కడ పుట్టారు. మొత్తంగా 2019లో కోటి 46 లక్షల 50 వేల మంది పిల్లలు పుట్టగా, అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఆ సంఖ్య 5.8 లక్షలు తగ్గింది.

బర్త్​రేట్​ తక్కువగా ఉన్నా జీవిత కాలం పెరగడంతో పోయినేడాది ఆ దేశ జనాభా 140 కోట్లను దాటేసింది. ఇప్పుడు అదే చైనాకు అతిపెద్ద సమస్యగా మారనుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, వృద్ధులు ఎక్కువై సంపాదించి కుటుంబాన్ని పోషించేటోళ్ల సంఖ్య తక్కువవుతుందని, దాని వల్ల ఎకానమీకి పెద్ద నష్టమే వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ 16 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్నోళ్లు 89.64 కోట్ల మంది ఉన్నారు. 2018 (89.73 కోట్లు)తో పోలిస్తే పోయినేడాది వారి సంఖ్య పడిపోయింది. వరుసగా ఎనిమిదో సంవత్సరం అందులో తగ్గుదల నమోదైంది. అది ఇలాగే కొనసాగితే 2050 నాటికి చైనా వర్క్​ఫోర్స్​ 23 శాతం పడిపోయే ప్రమాదముందని చెబుతున్నారు. చైనా పెట్టిన వన్​చైల్డ్​ పాలసీ వల్ల ఆడపిల్లలతో పోలిస్తే మగపిల్లలే ఎక్కువగా ఉన్నారన్న విమర్శలూ వ్యక్తమవుతున్నాయి. 2019 లెక్కలను చూస్తే ఆడవాళ్ల కన్నా మగవాళ్లే 3 కోట్ల మంది ఎక్కువగా ఉన్నారని చెబుతున్నారు. ఆ సమస్యలను అధిగమించేందుకు 2015లో వన్​చైల్డ్​ పాలసీని ప్రభుత్వం రద్దు చేసినా, పెద్దగా ఫలితాలు కనిపించట్లేదు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *