నోవెల్ కరోనా వైరస్ తొలుత చైనాను చిన్నాభిన్నం చేసింది. ఆ దేశంలోని వుహాన్ నగరం నుంచి వైరస్ కేసులు శరవేగంగా వ్యాపించిన విషయం తెలిసిందే. అయితే వైరస్ మృతుల సంఖ్యను డ్రాగన్ దేశం వెల్లడిస్తున్న తీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ఈ అనుమానాలను లేవనెత్తారు. చైనాలో వైరస్ మరణాలు చాలా తక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయని ట్రంప్ అన్నారు. చైనాలో చోటుచేసుకున్న మరణాలపై ఓ క్లాసిఫైడ్ రిపోర్ట్ వైట్‌హౌజ్‌కు అందింది. కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్యను చైనా కప్పిపుచ్చినట్లు బ్లూమ్‌బర్గ్ కూడా తన రిపోర్ట్‌లో పేర్కొన్నది. అయితే ప్రస్తుతం వైట్‌హౌజ్ నివేదిక తనకు అందలేదని, కానీ చైనాలో సంభవించిన మరణాల సంఖ్య మాత్రం తక్కువగా ఉన్నట్లు ఆయన డౌట్ వ్యక్తం చేశారు. సంఖ్య గురించి నేను అంత కచ్చితంగా చెప్పలేను, నేనేమీ అకౌంటెంట్‌ను కాదని ట్రంప్ అన్నట్లు సమాచారం. చైనాలో ఇప్పటి వరకు 81,554 మందికి కరోనా వైరస్ సోకింది. ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకారం 3312 మంది మరణించారు.

చైనా మరణాల సంఖ్యపై ట్రంప్ అనుమానం వచ్చింది
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]