మహబూబ్‌నగర్ (ఆరోగ్యజ్యోతి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ దవాఖానలలో కార్పొరేట్‌కు ధీటుగా వైద్యం అందుతున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో నూతనంగా రూ.16 కోట్లతో నిర్మించిన మాతా, శిశు వైద్యసేవల భవవాన్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్ రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, కలెక్టర్ వెంకట్రావులతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం మహబూబ్‌నగర్ ప్రభుత్వ దవాఖాన ప్రారంభించి సోమవారంతో 50 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 50 ఎకరాల స్థల ఏర్పాటుకు కృషి చేశామన్నారు. రూ.450 కోట్లతో మెడికల్ కళశాల నిర్మించుకున్న తర్వాత అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాడానికి వైద్యులు, సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో కేసీఆర్ కిట్ ప్రారంభమైనప్పటి నుంచి దవాఖానలపై ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు. ఒక్క సం వత్సరంలోనే 8వేల పైగా ప్రసవాలు జరిగాయని, దవాఖాన ప్రారంభమైన 50 సంవత్సరాలలో 83వేల ప్రసవాలు చేశారని పేర్కొన్నారు. ఎవరైన వైద్యసేవలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దవాఖాన వైద్యాధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ప్రస్తుతమున్న కలెక్టర్ కా ర్యాలయం ఖాళీ అయిన తర్వాత అక్కడ చిల్డ్రన్స్ సూ పర్ స్పెషాల్టీ దవాఖానను ఏర్పాటు చేస్తామని తెలిపా రు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్టా శ్రీ నివాస్, దవాఖాన సూపరింటెండెంట్ రాంకిషన్, గైనిక్ హెచ్‌వోడీ రాధ, ఆర్ఎంవోలు వంశీ, వక్కుల, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, కౌన్సిలర్లు రజితా విఠల్‌రెడ్డి, షబ్బీర్, రవికిషన్‌రెడ్డి, నవాకాంత్, పటేల్ ప్రవీణ్, రషీ ద్, ఏడీ కార్తీక్‌రెడ్డి, ఏఈ శరత్, పద్మ, సత్యనారాయణరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, కిశోర్, భాస్కర్ పాల్గొన్నారు.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]