[spt-posts-ticker]

జర్మనీ-ఫ్రాన్స్‌ల బెంబేలు

ఫ్రాంక్‌ఫర్ట్‌: ప్రపంచ వాణిజ్య యుద్ధాల వల్ల 2019లో పారిశ్రామిక ఉత్పత్తి నెమ్మదించి ఇబ్బంది పడిన జర్మనీ, ఫ్రాన్స్‌ ఆర్థిక వ్యవస్థలను ఇప్పుడు కరోనా వైరస్‌ బెంబేలెత్తిస్తోంది. ఈ ఏడాది వ్యవస్థలు పునరుత్తేజితం అవుతాయని ఆశిస్తుంటే, ఈ వైరస్‌ ప్రతికూలంగా మారిందని భావిస్తున్నారు. జర్మనీ కార్ల ప్లాంట్లకూ  చైనా నుంచి విడిభాగాలు సరఫరా అవుతాయి. ఇప్పుడు ఇవన్నీ కార్యకలాపాలు నిలపాల్సిందే.

అతిపెద్ద కార్ల ప్లాంటు మూసివేత
కరోనా దెబ్బకి దక్షిణ కొరియాతోపాటు మరిన్ని దేశాల్లో కార్ల కంపెనీల్లో ఉత్పత్తి నిలిచిపోతోంది. విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్‌ పరికరాల కోసం చైనాపై ఆధారపడటమే ఇందుకు కారణం.
* ఏడాదికి 14 లక్షల కార్ల తయారీ సామర్థ్యంతో, ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాంటుగా ప్రఖ్యాతి గాంచిన ఉల్‌సాన్‌ కాంప్లెక్స్‌ ప్రాజెక్టులో శుక్రవారం కార్యకలాపాలు నిలిపేసినట్లు హ్యుందాయ్‌ తెలిపింది. ఇందువల్ల 25,000 మంది కార్మికులకు బలవంతంగా సెలవు ఇవ్వడంతో పాటు, వేతనాల్లో కోత విధిస్తున్నారు. ఈ ప్లాంటును 5 రోజుల పాటు నిలిపేస్తే, సంస్థపై సుమారు రూ.3500 కోట్ల భారం పడుతుంది.
* కియా కూడా సోమవారం నాడు 3 ప్లాంట్లు మూసివేయనుంది. ఫ్రెంచ్‌ వాహన దిగ్గజం రెనో కూడా బుసాన్‌లోని ప్లాంటును వచ్చేవారం నిలిపేయనుంది.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *