[spt-posts-ticker]

జాగ్రతలు పాటిస్తే అదుపులో కరోన

వచ్చే మూడు నెలలు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు

హైదరాబాద్‌(ఆరోగ్యజ్యోతి): చలి తీవ్రతతో కరోనా పెరిగే అవకశ లు ఎక్కువగా ఉన్నాయని, జాగ్రతలు పాటిస్తే అదుపులో కరోన  ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపినారు.  అందువల్ల వచ్చే మూడు నెలల పాటు ప్రజలు పూర్తీ  జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు అయన  విన్నవించారు. కరోనా టీకా సహా జనవరి, ఫిబ్రవరి నాటికి శాశ్వత వైద్య చికిత్స కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఈ సందర్భంగా అయన తెలిపినారు.   ఢిల్లీలో రోజుకు 8 వేల నుంచి 9 వేల కరోనా కేసులు, 80 నుంచి 90 వరకు మరణాలు సంభవిస్తున్నాయన్నారు. వాయు కాలుష్యం, చలి వల్ల ఢిల్లీలో వైరస్‌ తీవ్రత ఉందని తెలిపినారు.  ‘అమెరికాలో రోజుకు  2 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. యూరప్‌లోనూ అదే పరిస్థితి నెలకొందని మనం అందరం పుర్తిస్తా యీలో జాగ్రతలు పాటించాలని  అన్నారు. బాధ్యతారహితంగా ఉన్నచోట వైరస్‌ ఉధృతిమరింత పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు.  90 శాతం వైరస్‌ వ్యాప్తికి కారణం ముక్కు, నోరే నని వీటి ద్వారానే వైరస్ వ్యాప్తి చెందుతుందని  కాబట్టి ప్రతి ఒక్కరు మాస్క్ దరిన్చాలన్నారు..అమెరికా, ఐరోపా దేశాల్లోనూ, కేరళ, దిల్లీ రాష్ట్రాల్లోనూ విజృంభిస్తున్న కొవిడ్‌ రెండో ఉద్ధృతి రోజు రోజుకు ఎక్కువ అవ్తున్దన్నారు. చలికాలం.. పండుగలు.. కాలుష్యం.. కారణంగా మన దగ్గరా కరోనా వైరస్‌ మళ్లీ విజృంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రజలు జాగ్రతగా ఉండాలన్నారు. రెండో ఉద్ధృతి పై ముందు జాగ్రత్తలపై వైద్యఆరోగ్యశాఖ ప్రతేక  దృష్టిపెట్టింది. ప్రజలుకూడా తగు జాగ్రతలు తీసుకొన్నట్లయితే కరోనాను అరికట్టవచాన్నారు. జనసమ్మర్థ ప్రాంతాల్లో సంచార వాహనాల ద్వారా పరీక్షలు చేపట్టాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల వద్దకెళ్లి నమూనాలను స్వీకరించి, అక్కడికక్కడే కొవిడ్‌ ఫలితాలను కూడా వెల్లడించనున్నారు. ప్రస్తుతం రోజుకు 40-45 వేల వరకూ పరీక్షలు చేస్తుండగా.. వాటిని రోజుకు 60-65 వేల వరకూ నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. తొందరలోనే వ్యాక్షిన్     అందుబాటులోకి వస్తుందని మొదటి విడతలో ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులకు ఇస్తారన్నారని, విడతల వారిగా అందరికి వ్యాక్షిన్ అందరికి ఇవ్వడం జరుగుతుందన్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *