[spt-posts-ticker]

డయాలసిస్‌ సేవలు విస్తృతం చేయాలి

కలెక్టరేట్‌ (మచిలీపట్నం), తెనాలి, (ఆరోగ్యజ్యోతి) : జిల్లా ఆసుపత్రిలో అందజేస్తున్న డయాలసిస్‌ సేవలను మరింత విస్తృతం చేసేలా చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘ నాయకులు కోరారు. బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యదర్శి కేవీవీ రాంబాబు, నగర అధ్యక్షుడు శేకుబోయిన సుబ్రహ్మణ్యం తదితరులు ఈ మేరకు వినతిపత్రాలను జిల్లా రెవెన్యూ అధికారి ఎ.ప్రసాద్‌, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ జయకుమార్‌లకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ఆస్పత్రిలోని డయాలసిస్‌ కేంద్రంలో సరిపడా బెడ్లు లేవని, జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి చికిత్స నిమిత్తం వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ఒక్కో రోగికి డయాలసిస్‌ చేసేందుకు కనీసం 3 గంటలు పడుతోందని, అధిక సంఖ్యలో వస్తున్న రోగులు తమ వంతు వచ్చే వరకూ వేచి చూడాల్సి వస్తోందన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి డయాలసిస్‌ కేంద్రంలో పడకలతో పాటు సిబ్బందిని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సంఘ నాయకులు వేముల బుజ్జి, బత్తిన వీరబాబు, ఎన్‌.కృష్ణ, రేణుకుమార్‌, నాగరాజు, శేషు తదితరులు వినతిపత్రాలు సమర్పించిన వారిలో ఉన్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *