[spt-posts-ticker]

డాక్టర్‌ కార్ల్‌ జూన్‌, డాక్టర్‌ నరసింహన్‌లకు జీనోమ్‌ వ్యాలీ ఎక్స్‌లెన్స్‌ అవార్డు

హైదరాబాద్‌: ఈ ఏడాది జీనోమ్‌ వ్యాలీ ఎక్స్‌లెన్స్‌ అవార్డు యూఎస్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా పాథాలజీ, లేబొరేటరీ మెడిసిన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కార్ల్‌ హెచ్‌. జూన్‌, నొవార్టిస్‌ సీఈఓ డాక్టర్‌ నరసింహన్‌కు లభించింది. బయోఏషియా- 2020 సదస్సు పురస్కరించుకుని ఈ అవార్డులు ప్రకటించారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఏషియన్‌ బయోటెక్‌ అసోసియేషన్‌ (ఫ్యాబా), తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా హైదరాబాద్‌లో ఈ నెల 17 – 19వ తేదీల్లో ఈ సదస్సు నిర్వహించనున్నాయి. డాక్టర్‌ కార్ల్‌ హెచ్‌. జూన్‌ కేన్సర్‌ చికిత్సలో వినియోగించే టీ-సెల్‌ థెరపీని అభివృద్ధి చేశారు. డాక్టర్‌ నరసింహన్‌ సెల్‌, జీన్‌ థెరపీ, వ్యాక్సిన్ల విభాగంలో ఎన్నో ఆవిష్కరణలకు నేతృత్వం వహించారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *