[spt-posts-ticker]

డాక్టర్‌ రెడ్డీస్‌ చేతికి వోకార్డ్‌ జనరిక్‌ ఔషధాలు

లావాదేవీ విలువ రూ.1850 కోట్లు

హైదరాబాద్‌: మనదేశంతో పాటు మరో 4  (నేపాల్‌, శ్రీలంక, భూటాన్‌, మాల్దీవులు) దేశాల్లో వోకార్డ్‌ నిర్వహిస్తున్న బ్రాండెడ్‌ జనరిక్‌ ఔషధాల వ్యాపారాన్ని డాక్టర్‌ రెడ్డీస్‌ కొనుగోలు చేస్తోంది. లావాదేవీ విలువ రూ.1,850 కోట్లు. దీనివల్ల శ్వాసకోశ, నరాల, చర్మ వ్యాధులు, గ్యాస్ట్రోఎంటరాలజీ, నొప్పి నివారణ, వ్యాక్సిన్ల విభాగాలకు చెందిన 62 బ్రాండెడ్‌ జనరిక్‌ ఔషధాలు డాక్టర్‌ రెడ్డీస్‌ చేతికి వస్తాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లోని బద్దీలో గల వోకార్డ్‌ ఔషధాల తయారీ యూనిట్‌, దాని సిబ్బంది మార్కెటింగ్‌- విక్రయ విభాగాల కూడా డాక్టర్‌ రెడ్డీస్‌కు బదిలీ అవుతాయి. ఈ ఔషధాలపై 2018-19లో వోకార్డ్‌ రూ.594 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో రూ.377 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. మధుమేహం, పలు రకాల నరాల వ్యాధులకు సంబంధించిన అధునాతన ఔషధాలు, కొన్ని యాంటీ-బయాటిక్స్‌ తయారీపై అధికంగా దృష్టి సారించాలనే లక్ష్యానికి అనుగుణంగా బ్రాండెడ్‌ జనరిక్‌ ఔషధాల వ్యాపారాన్ని విక్రయించినట్లు వోకార్డ్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ హబీబ్‌ ఖొరాకివాలా వెల్లడించారు. ఎంతో వేగంగా విస్తరిస్తున్న థెరప్యూటిక్‌ విభాగాల్లో విస్తరించేందుకు వోకార్డ్‌ నుంచి సొంతం చేసుకున్న ప్రాక్టిన్‌, జెడెక్స్‌, బ్రో-జెడెక్స్‌, ట్రైప్టోమెర్‌, బయోవ్యాక్‌ వంటి బ్రాండ్లు ఉపకరిస్తాయని డాక్టర్‌ రెడ్డీస్‌ ఎండీ జీవీ ప్రసాద్‌ తెలిపారు.  2020-21 మొదటి త్రైమాసికంలో ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుందని డాక్టర్‌ రెడ్డీస్‌ అంచనా వేస్తోంది.

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *