[spt-posts-ticker]

ఢిల్లీ హింస, కరోనా వైరస్‌పై మోదీతో చర్చించిన కేజ్రీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారంనాడు కలుసుకున్నారు. పార్లమెంటులోని ప్రధాని కార్యాలయానికి వచ్చిన కేజ్రీవాల్ కొద్దిసేపు ఆయనతో పలు విషయాలపై చర్చించారు.  ప్రధానంగా ఢిల్లీ అల్లర్లు, కోవిడ్-19 (కరోనా) వైరస్‌‌‌ నిరోధానికి సమష్టిగా కలిసి పనిచేయడంపై ఉభయులూ చర్చించారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా మూడోసారి పగ్గాలు చేపట్టిన అనంతరం ప్రధానిని కలుసుకోవడం ఇదే ప్రథమం. ఢిల్లీ అల్లర్ల అనంతరం కూడా ఉభయులూ సమావేశం కావడం ఇదే మొదటిసారి.

కాగా, ఢిల్లీ హింసాకాండకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరినట్టు ఆయనతో సమావేశానంతరం కేజ్రీవాల్ మీడియాకు తెలిపారు. కోవిడ్-19పై సమష్టి చర్యల విషయాన్ని కూడా ఉభయులూ చర్చించామని చెప్పారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *