[spt-posts-ticker]

తిరుపతిలో తైవాన్ వాసికి కరోనా పరీక్షలు…నెగిటివ్ అన్న వైద్యులు

తిరుపతి: తిరుపతి రుయా ఆస్పత్రిలో కరోనా లక్షణాలతో చేరిన తైవాన్ వాసికి వైరస్ లేదని తేల్చారు. మూడు రోజుల క్రితం కోవిడ్-19 అనుమానిత లక్షణాలతో తిరుపతి రుయా ఆస్పత్రిలో చేరిన తైవాన్ వాసిని ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అతడి నుంచి సేకరించిన నమూనాలను పరీక్షల నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి పంపారు. ఫలితాల్లో వైరస్ లక్షణాలు లేవని వైద్యులు నిర్ధారించారు. కోవిడ్-19 నెగిటివ్ రావడంతో అతడిని డిశ్చార్జ్ చేస్తామని రుయా వర్గాలు చెప్పాయి.

సాధారణంగా కొవిడ్-19 పాజిటివ్ అయితే బాధితుడు ముందుగా అక్యూట్ రెస్పిరేట్రీ డిస్ట్రెస్ సిండ్రోమ్‌కు గురవుతాడు. తద్వారా అకస్మాత్తుగా ఊపిరితిత్తులు వ్యాకోచిస్తాయి. ఒక్కోసారి పూర్తిగా విఫలమవుతాయి. ఆఖరికి గాలి పీల్చుకోవడం కూడా కష్టమైపోయి అకస్మాత్తుగా మరణం సంభవిస్తుంది. అయితే రుయాలో ఉన్న తైవాన్ వాసికి అలాంటి లక్షణాలు ఏవీ లేవని డాక్టర్లు తెలిపారు. శనివారం ఆస్పత్రిలో చేరిన సమయంలో జలుబు, దగ్గుతో ఉన్నాడని, ప్రస్తుత దగ్గు కూడా పూర్తిగా తగ్గిందని వైద్యులు స్పష్టం చేశారు. ఐసోలేషన్ వార్డులోకి వెళ్లే వైద్యులు, సిబ్బంది ప్రత్యేక డ్రెస్‌కోడ్ అవలంభిస్తున్నారు. తిరుపతి రుయాలో చేరిన తైవాన్ వాసికి కరోనా వైరస్ సోకలేదని వైద్య నివేదికలో తేలింది. దీంతో అతనితో కలిసి పనిచేసిన సహచరులు ఊపిరిపీల్చుకున్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *