[spt-posts-ticker]

తెలంగాణలో ఒక్క రోజే 75 కేసులు

హైదరాబాద్‌, (ఆరోగ్యజ్యోతి): కరోనా వైరస్‌ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. శుక్రవారం ఏకంగా 75 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మరణించారు. వీరిలో ఒకరు రంగారెడ్డి జిల్లాకు చెందిన మహిళ కాగా, మరొకరు సికింద్రాబాద్‌కు చెందిన వ్యక్తి అని మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు. కాగా, సదరు మహిళ ఈనెల 1వ తేదీన మరణించగా.. ఆమెకు కరోనా పాజిటివ్‌ అనే విషయం శుక్రవారం నిర్ధారణ అయింది. మొత్తమ్మీద రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 229కి చేరగా.. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకరిద్దరు మినహా అందరూ మర్కజ్‌కు వొళ్లొచ్చిన వారే కావడం గమనార్హం. కాగా, శుక్రవారం 15 మంది డిశ్చార్జి కాగా, మొత్తం 32 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. శుక్రవారం 400 మంది మర్కజ్‌కు వెళ్లొచ్చినవారు, వారి బంధువులకు పరీక్షలు నిర్వహించగా, 75 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇంకా 600 మంది మర్కజ్‌కు వెళ్లొచ్చినవారు, వారి బంధువుల నమూనాలను వైద్యాధికారులు కరోనా వైద్య పరీక్షలకు పంపించారు. వారి వివరాలు శనివారం వెల్లడయ్యే అవకాశముంది.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *