హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): తెలంగాణలో మంగళవారం ఒక్కరోజే 178 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఆరుగురు మృతి చెందారు. ఇప్పటివరకూ 3,920 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మంగళవారం జీహెచ్ఎంసీలో 143, రంగారెడ్డిలో 15, మేడ్చల్‌లో 10, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, మెదక్‌లో రెండేసి, జగిత్యాల, కుమ్రం భీం, సిరిసిల్ల, వరంగల్ రూరల్‌లో ఒక్కో కేసు నమోదు అయింది. ఇప్పటి వరకు 1,742 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 2,030 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 148 మంది మృతి చెందారని తెలంగాణ వైద్యారోగ్య శాఖ అధికారులు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. కాగా రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, మృతులు ఆందోళన కలిగిస్తున్నాయి. లాక్డౌన్ సడలింపుతో కరోనా ఒక్కసారిగా విజృంభించింది. దీంతో రోజు రోజుకు కరోనా బారిన పడే వారి సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. వారం నుంచి అయితే మరీ ఘోరంగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో అయితే పాజిటివ్ నిర్ధారణ కేసులు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుతోంది. ఎప్పుడు ఎవరి వల్ల కరోనా సోకుతుందోనన్న భయం ప్రజల్లో కలుగుతోంది.

తెలంగాణలో విజృంభించిన కరోనా.. మంగళవారం ఒక్కరోజే..
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]